Sunday, April 28, 2024
- Advertisement -

త్రివిక్రమ్ పై తారక్ అలక ఎందుకు

- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తారక్ చిత్రం అంటే అభిమానులంతా ఎగిరి గంతేశారు. ఎప్పటినుంచో తారక్ స్వయంగా అడుగుతుంటే పట్టించుకోకుండా చాలా కాలానికి త్రివిక్రమ్ ఓకే చెప్పాడు. త్రివిక్రమ్ ఇంతకాలం టైమ్ తీసుకుని తన దగ్గరకు వచ్చినా ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. అయినప్పటికీ అతనితో సినిమాను స్టార్ట్ చేయడానికి సిద్ధపడ్డాడు. ఇప్పటికే ఇసినిమా లాంచ్ అయితే జరిగిపోయింది.

పవన్ ‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ కాపీ డిసెంబర్లో వచ్చాక.. వీరిద్దరి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. కానీ.. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ – తారక్ మధ్య ఇష్యూ స్టార్ట్ అయ్యిందని ఇన్ సైడ్ టాక్. అను ఎమ్మానుయేల్ హీరోయిన్ గా నటించే ఈ సినిమాలో మరో మాజీ హీరోయిన్ కు ఇంపార్టెంట్ రోల్ ఉంటుందని చెబుతున్నారు.

ఎందుకంటే…. అత్తారింటికి దారేదిలో నదియా, అజ్ఞాతవాసిలో ఖుష్బూలాగే ఈ పాత్రకు పర్ ఫార్మెన్స్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ఈ పాత్రకు కూడా ఓ వెటరన్ హీరోయిన్ కై సెర్చ్ షురూ అయింది. ఇందుకు గాను టబు పేరును త్రివిక్రమ్ ప్రపోజ్ చేస్తే … తారక్ ‘నో’ చెప్పినట్లు తెలుస్తుంది. ఇలా చెప్పడానికి కారణం.. తారక్ తో టబు పాత్ర స్టెప్ కూడా వేయనుంది. ఒకవేల టబు స్టెప్ వేస్తే… తారక్ ఆమె హైట్ ముందు తేలిపోతాడు కాబట్టి… ఆమెను తిరస్కరిస్తున్నాడు. ఈ రకంగా చూసినప్పుడు తారక్ అభిప్రాయం కరెక్టే. ఇవన్నీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ లు రావడానికి కారణమయ్యాయి. మరి ఇదంతా మెగా కాంపౌండ్ చెబితే చేస్తున్నాడా లేక త్రివిక్రమ్ దూరదృష్టి లేకుండా టబు పేరు ప్రస్తావించి తారక్ ను ఇబ్బంది పెడుతున్నాడా అనేది త్వరలో తేలిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -