Monday, April 29, 2024
- Advertisement -

పవన్ పై దిల్ రాజుకు ఎందుకంత కోపం..?

- Advertisement -

దిల్ రాజు డ్రీమ్ ఒకటుంది. ఎలాగైనా సరే పవన్ తో ఓ సినిమా చేయాలని. కాని అది ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నదే. కాని వర్కవుట్ కావడం లేదు. ఎన్నోసార్లు అడిగినప్పటికీ పవన్ సింపుల్ స్మైల్ తో నో చెప్పేస్తూ ఉండడంతో దిల్ రాజుకు లోలోన కాస్త కోపం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ తో కానిది మిగతా మెగా హీరోలతో చేసుకుందామను కుని అటువైపుగా నరుక్కుంటూ వస్తున్నాడు.

కరెక్ట్ గా ఇదే టైమ్లో పవన్ ,త్రివిక్రమ్ల అజ్ఞాతవాసి సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అదే టైమ్లో దిల్ రాజు సైతం తన మిడిల్ క్లాస్ అబ్బాయిని రిలీజ్ చేయాలనుకున్నాడు. కాని వెనక్కి తగ్గుదామనుకున్నాడు. మరీ ఏమనుకున్నాడో ఏమో… పాత కోపం గుర్తుకొచ్చి.. థియేటర్లు నా చేతిలోనే ఉన్నాయి కదా అనుకుని డైరెక్ట్ అటాక్ కు సిద్ధపడిపోయాడు. ప్రజెంట్ పరిశ్రమలో ఈ టాపిక్ మంచి హాట్ ఐటమ్ అయిపోయింది. ఈ పోటీలో నాని నిలబడితే ఎక్కడలేని స్టార్ డమ్ వచ్చేస్తుంది. టాప్ హీరోలలో నాని కూడా ఒకడైపోతాడు. తేడా కొడితే మాత్రం కాస్త కుదుపుకు లోనవుతాడు. ఫైనల్ గా దిల్ రాజు మత్రం తన పంతం తాను నెగ్గించుకున్నవాడు అవుతాడు. అలాగైనా పవన్ దిల్ రాజుతో ఓ సినిమాకు కమిటౌతాడేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -