Sunday, May 5, 2024
- Advertisement -

ప్యాకేజీ కుదురితే టీడీపీ…. లేకుంటే వేరే పార్టీ…..

- Advertisement -

అల‌నాటి అందాల తార‌….టీలీవుడ్‌లోను..బాలీవుడ్‌లోను విజ‌య‌ప‌తాకం ఎగ‌రేసిన తార జ‌య‌ప్ర‌ద‌. అక్క‌డి రాజ‌కీయాల‌లో ఒక వెలుగు వెలిగి చివ‌ర‌కు అక్క‌డ రాజ‌కీయాల‌నుంచి గెంటేయ‌డంతో రాజ‌కీయ‌జీవితం ప్రారంభించిన‌ సొంత పార్టీ గూటికి చేరుకొనేందుకు పావులు క‌దుపుతున్నారు.

సినిమా రంగంలో టాప్‌లో ఉన్నప్పుడే ఆమె రాజకీయ జీవితం టీడీపీ నుంచి ప్రారంభించింది. త‌ర్వాత జ‌రిగిన పరిణామాల్లో ఆమె ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిపోయి సమాజ్‌వాదీ పార్టీలో చేరి రెండుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీ రాజకీయ జీవితం ముగిసిపోయిన జయప్రదకు మళ్లీ తన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇన్నాళ్ల‌కు గుర్తుకొచ్చింది. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌ కావాలని నిర్ణయించుకున్న ఈ మాజీ హీరోయిన్‌ ఆ పని స్వరాష్ట్రం నుంచే చేసేందుకు సిద్ధంగా ఉంది.

అయితే ఏపార్టీలో చేరాల‌నె విష‌యంలో ఇన్నాల్లు ఒక క్లారిటీలేదు. గ‌తంలో వైసీపీలో చేరుతుంద‌నె వార్త‌లు షికారు చేశాయి . గ‌తంలో ఏపీకి వచ్చిన జయప్రద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎంతో ప్రశంసించారు. రాజధాని నిర్మాణం చిన్నవిషయం కాదంటూ, ఈ విషయంలో బాబు చేస్తున్న కృషి అమోఘంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించాలని చిల‌క ప‌లుకులు ప‌లికారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌నుంచి అక్క‌డి ప్ర‌జ‌లు వెల్ల‌గొట్ట‌డంతో తెలుగు రాజకీయాల్లోకి రావాలని జయప్రద గట్టిగానే నిర్ణయించుకున్నారు. సినిమా నటిగా గ్లామర్‌ ఉండటమే కాకుండా, దీర్ఘకాలం యూపీ రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిని, రెండుసార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఆమె చేరబోయే పార్టీకి ఇదంతా ప్లస్‌ అవుతుంది.

మేక‌ప్ ఉంటేనే సినిమారంగంలో లైప్ ఉంటుంది అదే విధంగా రాజకీయాల్లో కంటిన్యూగా ఉండటానికి ఏదో ఒక పార్టీ కావాలి. అది సొంత రాష్ట్రమైనా, పొరుగు రాష్ట్రమైనా కొందరు పట్టించుకోరు. జయప్రదదీ ఆదే అభిప్రాయం. కొంతకాలం కిందట ‘ఐ యామ్‌ వెయింటింగ్‌ ఫర్‌ ఎ గుడ్‌ పార్టీ’ అని ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మళ్లీ ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి అక్కడి రాజకీయాల్లో ఆజంఖాన్‌తో గొడవలు పడలేనని, ఇప్పటివరకు చేసిన పోరాటం చాలని అన్నారు. సో…యూపీ రాజకీయానికి శుభం కార్డు వేశార‌నె చెప్పాలి.

చంద్ర‌బాబును పొగుడ‌తూనె కేంద్రాన్ని విమ‌ర్శించారు. ఇది బాబుకు ఇబ్బందిక‌ర‌మ‌నే చెప్పాలి. ఎందుకంటె ప్ర‌త్యేక‌హోదాకు బాబు మంగ‌లం పాడి ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ఇప్ప‌టికైతే ఏపార్టీలో చేర‌లేద‌ని త్వ‌ర‌లో రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై నిర్ణ‌యం తీసుకుంటాన‌ని సెల‌విచ్చారు జ‌య‌ప్ర‌ద‌. అప్ప‌టిదాకా రాష్ట్రప్రజలంతా జయప్రద మీద బెంగ‌పెట్టుకున్న‌ట్లు .

జ‌య‌ప్ర‌ద‌కు ఒక రాజకీయ లక్ష్యముందట. అదేంటో ఇపుడు మాత్రం బయటపెట్టరట. ఏ పార్టీలో చేరేది నిర్ణయించుకున్నాక మాత్రమే రాజకీయ లక్ష్యాన్ని ప్రకటిస్తారట. జయప్రద తాజా మాటలు చూస్తుంటే ప్యాకేజి కుదిరితే టిడిపిలోనే చేరుతారేమోననే అనుమానాలు మొదలయ్యాయి. యూపీ రాజ‌కీయాల‌లో స్థానం కోల్పోయి ప్యాకేజీల‌కోసం రాజ‌కీయాల్లోకి వ‌స్తే ప్ర‌జ‌లు ఆద‌రిస్తారా అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -