Tuesday, May 14, 2024
- Advertisement -

ఇవాంక ట్రంప్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌……

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్‌ పర్యటన సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. అమెరికా నుంచి ప్రతినిధులు, డెలిగేట్ల బృందంతో కలసి బయలుదేరిన ఆమె.. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. రిజ‌ర్వ్ టైంలో ఇవాంక ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇవాంక మొత్తం 40 గంటల పాటు హైదరాబాద్ లో ఉండ‌నుంది . తన పర్యటనలో 18 గంటల సమయాన్ని ‘రిజర్వ్’ చూపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని హోటల్ లో బస చేసిన ఆమె, మధ్యాహ్నం 2:50 వరకూ ఏం చేస్తారన్నది సస్పెన్స్, ఆపై 2 గంటలకు హెచ్ఐసీసీ చేరుకునే ఆమె, 7:15 వరకూ గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సులో, ఆపై తెలంగాణ ప్రభుత్వం ఫలక్ నుమా ప్యాలెస్ లో ఇచ్చే విందులోనూ పాల్గొని తిరిగి హోటల్ కు వెళతారు.

బుధవారం ఉదయం మాత్రమే సదస్సుకు హాజరై ప్రసంగించే ఆమె, తిరిగి హోటల్ కు వెళతారు. ఆపై ఓ అరగంట పాటు ట్రైడెంట్ హోటల్ లో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఆపై 5:35 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరి వెళతారు. ఇక, ఆమె షెడ్యూల్ లో ‘రిజర్వ్’ అని పేర్కొంటూ చూపిన సమయంలో ఏం చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది.

రిజ‌ర్వ్ టైంలో ఇవాంక చార్మినార్ వంటి చారిత్రక ప్రాంతాలను సందర్శిస్తారా? లేదా విశ్రాంతి తీసుకునేందుకు మొగ్గు చూపుతారా? అన్నది తెలియాల్సి వుంది. ఆమె చార్మినార్ కు రావచ్చన్న సమాచారం కూడా ఉండటంతో పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తనకున్న రిజర్వ్ సమయంలో ఇవాంకా, కొందరు ప్రముఖులను కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.

ఇవాంకా పర్యటన వివరాలు
28వ తేదీ (మంగళవారం)

– 3.00 తెల్లవారుజామున: ఇవాంకా శంషా బాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తాను బస చేసే హోటల్‌కు వెళ్ళారు.
– మధ్యాహ్యం 2.50 వరకు: రిజర్వ్‌ సమ యం (అధికారులు వివరాలు వెల్లడించకుండా.. ‘రిజర్వు’గా పేర్కొన్నారు)
– 3.00: ఇవాంకా హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు.
– 3.10– 3.25: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ
– 3.35– 3.55: ప్రధాని మోదీతో భేటీ
– 4.00–4.25: భారత స్టార్టప్‌ల అధునాతన ప్రదర్శన ‘ది ఇండియన్‌ ఎడ్జ్‌’ను తిలకిస్తారు.
– 4.25: ప్రధాని మోదీతో కలసి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొంటారు.
– 4.45–4.50: ప్రారంభోత్సవ వేదికపై ప్రసంగిస్తారు.
– 5.15–5.45: ప్లీనరీ సెషన్‌లో ‘మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు– నాయక త్వం’పై నిర్వహించే చర్చాగోష్టికి ప్యానెల్‌ స్పీకర్‌గా ఉంటారు.
– 5.50–6.00: హెచ్‌ఐసీసీ నుంచి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు.
– 7.15: హోటల్‌ నుంచి బయల్దేరుతారు.
– 8.00: ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు.
– 8.05–8.20: ‘ట్రీ ఆఫ్‌ లైఫ్‌’పేరుతో ఏర్పాటు చేసే భారతీయ కళలు, దుస్తుల ప్రదర్శనను తిలకిస్తారు.
– 8.20–8.35: భారత చారిత్రక వారసత్వంపై లైవ్‌షోను తిలకిస్తారు.
– 8.45: ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులతో కలసి విందులో పాల్గొంటారు.
– 10.00: ఫలక్‌నుమా నుంచి బయల్దేరుతారు.
– 10.40: హోటల్‌కు చేరుకుని బస చేస్తారు.

29వ తేదీ (బుధవారం)
– ఉదయం 9.00: అమెరికా బృందంతో బ్రేక్‌ఫాస్ట్‌
– 9.50: హోటల్‌ నుంచి హెచ్‌ఐసీసీకి బయలుదేరుతారు.
– 10.00: సదస్సు ప్లీనరీ సెషన్‌లో ‘వి కెన్‌ డూ ఇట్‌.. అన్ని రంగాల్లో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం’ అంశంపై చర్చాగోష్టి లో పాల్గొంటారు.
– 11.00: హెచ్‌ఐసీసీ నుంచి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. భోజన విరా మం అనంతరం మహిళా పారిశ్రామిక ప్రతి నిధులతో ట్రైడెంట్‌ హోటల్‌లో ముఖాముఖి
– 5.35: హోటల్‌లోనే సిబ్బందితో విందు చేసి విమానాశ్రయానికి బయల్దేరుతారు
– 8.20: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు
– 9.20: దుబాయ్‌ ఎమిరేట్స్‌ విమానంలో అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -