Sunday, May 5, 2024
- Advertisement -

మ‌రోసారి ప‌వ‌న్ డైరెక్ట‌ర్‌ను ప‌ట్టిన యంగ్‌టైగ‌ర్‌

- Advertisement -

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కెరీర్‌లో సర్దార్‌ గబ్బర్‌సింగ్ అత్యంత దారుణ‌మైన ఫ‌లితం పొందిన సినిమా. ఈ సినిమాను తీసిన ద‌ర్శ‌కుడు బాబీ. ప‌వ‌న్ స్టామినా కూడా ఈ సినిమాను నిల‌బెట్ట‌లేక‌పోయిందంటే సినిమా ఎలా ఉందో తెలుసుకోవ‌చ్చు. అయితే ఆ సినిమా విష‌యంలో హీరో జోక్యం చేసుకోవడంతో క‌థ అంతా మారి దర్శకత్వం దారి త‌ప్ప‌డంతో ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింద‌ని అప్ప‌ట్లో స‌మాచారం ఉంది. అందుకే స్టోరీలో ద‌ర్శ‌కుడిని పూర్తి వ‌దిలేస్తే సినిమా సూప‌ర్‌గా ఉంట‌ద‌ని ఎన్నోసార్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడితో ప‌ని చేయ‌డానికి యంగ్ టైగ‌ర్ నంద‌మూరి తార‌క రామారావు సిద్ధ‌మ‌య్యాడు.

అజ్ఞాతవాసి లాంటి ఫ్లాప్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత రాజ‌మౌళితో మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేస్తున్నాడు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ ఫ్లాపు ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు చేస్తున్నాడు.

భారీ డిజాస్టర్‌తో ఫ్లాప‌యిన ద‌ర్శకుడితో ఎన్టీఆర్ సినిమాలు చేసి సూప‌ర్‌హిట్లు పొందుతున్నాడు. హార్ట్‌ ఎటాక్‌తో ఫ్లాపయిన ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్‌తో టెంపర్‌ సినిమా చేసి విజ‌యం పొందాడు. ఆ తరువాత వన్‌ నేనొక్కడినే సినిమాతో ప‌రాజ‌యం పొందిన సుకుమార్‌తో నాన్నకు ప్రేమతో చేసి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అజ్ఞాత‌వాసి సినిమాతో ఫ్లాపు అందుకున్న త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తుండ‌గా అదే కోవ‌లో స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ ఫ్లాపు తీసిన ద‌ర్శ‌కుడు బాబీతో సినిమా చేస్తున్నాడు. మ‌రీ ఈ సినిమాతో బాబీతో ఎన్టీఆర్ విజ‌యం కొట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -