Sunday, May 5, 2024
- Advertisement -

సిగ్గుతో బాధ‌ప‌డ్డా.. ఇప్పుడు స‌మాధానంగా ‘రంగస్థలం’

- Advertisement -

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ ఎంత ఎత్తుకు ఎదిగినా మ‌న స్థాయి.. నేప‌థ్యం మ‌ర‌వురాదు. ప్ర‌పంచ స్థాయికి సినిమాలు నిర్మించినా మ‌న తెలుగు ప్రాంతాల‌ను విస్మ‌రించ‌డం త‌గ‌దు. ఇదే విష‌య‌మై ఓ వ్య‌క్తి ప్ర‌శ్నించాడు. అన్నీ సినిమాలు విదేశాల్లో తీస్తున్నావ్ బాగానే ఉంది.. కానీ మ‌న తెలుగు నేప‌థ్యంలో ఎందుకు తీయ‌డం లేదు అని ప్ర‌శ్నించాడు. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానంగానే ఇప్పుడు ‘రంగస్థలం’ రూపుదిద్దుకుంది.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చరణ్, స‌మంత‌తో చేసిన సినిమా ‘రంగస్థలం’. ఈ సినిమాను గోదావ‌రి ఒడ్డున ఓ ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సినిమా ఉంది. రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత ప‌ల్లెటూరు యువ‌తీయువ‌కులుగా నిపిస్తున్నారు. 1980ల కాలంలో ఉన్న ప‌రిస్థితుల‌ను ప్ర‌తిబింబించేలా సినిమాను తెర‌కెక్కించారు.

ఈ విధంగా సినిమాను ఎందుకు తీస్తున్నాడో సుకుమార్ ఇటీవ‌ల ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ‘నేను 28 ఏళ్ల వరకు పల్లెటూరిలోనే ఉన్నాను. సినిమాల్లోకి వచ్చాక విదేశాలంటూ తిరుగుతున్నా. నా గత సినిమాలు ‘వన్ నేనొక్కడినే’, ‘నాన్నకు ప్రేమతో’ ఎక్కువగా విదేశాల్లోనే షూట్ చేశాం. ఆ సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరకొచ్చి సర్ మీరు సినిమాలు చాలా బాగా తీస్తున్నారు. కానీ మన తెలుగు నైపథ్యంలో ఎందుకు తీయడంలేదు అనడిగారు. ఆ ఒక్క‌మాట‌తో సుకుమార్ సిగ్గుతో త‌ల‌దించుకున్నారంట‌.

ఆ మాటకు త‌న‌కు సిగ్గనిపించి దానికి సమాధానంగానే ‘రంగస్థలం’ చేశానని ప్ర‌క‌టించాడు. ప్రతి పల్లెటూరు నాటక రంగంలానే ఉంటుంది. అక్కడ రకరకాల మనుషులు, పాత్రలు ఉంటాయి. అందుకే అన్ని పల్లెటూళ్లను కలిపేలా రంగస్థలం అని పేరు పెట్టాం అని వివ‌రించారు. నవీన్ యెర్నేని నిర్మాత‌గా రూపొందించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు పూర్తి చేసుకుంటూ మార్చి 30వ తేదీన విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -