Thursday, April 25, 2024
- Advertisement -

ఆ స్టార్ హ్యాండ్ ఇవ్వడంతో అ!2 ఆగిపోయిందంటున్న డైరెక్టర్!

- Advertisement -

ఎంతో వైవిధ్యమైన కథలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరించడంలో యంగ్‌ డైరెక్టర్‌ ప్ర‌శాంత్ వ‌ర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది‌. ప్రశాంత్ వర్మ ఎంతో వైవిద్యభరితమైన కథాంశం ‘అ!’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన కల్కి ఈ చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

తాజాగా ప్రశాంత్ వర్మ “జాంబీరెడ్డి” సినిమా ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో మనకు తెలిసిందే. తెలుగులో జాంబీ జానర్‌లో వచ్చిన మొదటి చిత్రం కావడంతో, ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ తొలి సినిమా ‘అ!’సినిమాకు సీక్వెల్ గా ‘అ!2′ సినిమా వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు.

Also read:అది చాలా మిస్ అవుతున్న: యాంకర్ అనసూయ

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం గురించి దర్శకుడు తెలిపారు.అ2 స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయిందని,ఈ సినిమాను స్టార్ హీరోతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించాలని ప్లాన్ చేసాము,దీనికి ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అంతా ఓకే అయిందనుకుంటుండగా ఈ సినిమాలో చేయడం కోసం అతనికి డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక‌పోతున్నట్లు చెప్పడంతో ఈ సినిమా సీక్వెల్ అలాగే ఆగిపోయిందనే విషయం తెలియజేశారు.

Also read:ఈ సీరియల్స్ హీరోయిన్స్ అసలు వయసు ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -