Sunday, May 11, 2025
- Advertisement -

ఆ దర్శకుడి రెమ్యునరేషనే రూ.595 కోట్లు!

- Advertisement -

అవును మీరు చదువుతుంది నిజమే. ఆ దర్శకుడి రెమ్యునరేషనే ఏకంగా రూ.595 కోట్లు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్..ఓపెన్ హైమర్ సినిమాకు గానూ ఇంత భారీ మొత్తంలో పారితోషికాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా 13 విభాగాల్లో నామినేషన్స్ పొంది రికార్డు సృష్టించింది. అలాగే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఏకంగా 900 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో రూ.8000 వేల కోట్లు) రాబట్టగా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

వ‌ర‌ల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కగా గ్రాస్ కలెక్షన్స్‌లో 15 శాతం వసూళ్లను పారితోషికం కింద తీసుకునేందుకు క్రిస్టోఫర్ నోలన్ నిర్మాతలతో ఒప్పంది కుదుర్చుకున్నారట. దీంతో 72 మిలియన్ డాలర్లు క్రిస్టోఫర్‌కు రాగా భారత కరెన్సీలో అక్షరాలా రూ.595 కోట్లు.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ యూనివర్సల్ పీకాక్ లో ఫిబ్రవరి నుండి స్ట్రీమింగ్ అవుతోండగా డీవీడీలు, సీడీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక తెలుగులో ప్రముఖ ఓటీటీ సంస్థ జియో మార్చి 21 నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ఇంగ్లీషుతో పాటు దక్షిణాది భాషల్లో సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -