Wednesday, May 8, 2024
- Advertisement -

ఆస్కార్..ఓపెన్ హైమర్‌ అవార్డుల పంట

- Advertisement -

ప్రతిష్టాత్మక 96వ ఆస్కార్ అవార్డు వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగిన ఈ వేడుకలకు సినీ తారలు తరలివచ్చారు. ఇక హాలీవుడ్ సంచలనం ఓపెన్ హైమర్‌కు అవార్డుల పంట పండింది. ఏకంగా 13 విభాగాల్లో నామినేషన్స్ సాధించగా 7 విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.

బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్‌, బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఓపెన్ హైమర్ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.ఓపెన్ హామర్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్ అవార్డు గెలుచుకున్నాడు.

పూర్ థింగ్స్ 11 విభాగాల్లో నామినేట్ కాగా బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ కాస్టూమ్‌ డిజైన్‌, బెస్ట్‌ మేకప్ అండ్ హెయిర్‌ స్టయిల్‌, బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ నాలుగు విభాగాల్లో సత్తాచాటగా బార్బీ మూవీకి బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ అవార్డు దక్కింది. 10 నామినేషన్స్ తెచ్చుకున్నా ఒక్క అవార్డు కూడా గెలుచుకోలేకపోయింది కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -