- Advertisement -

రామ్ చరణ్ తో కొత్త సినిమా చేయబోతున్న సుకుమార్!

- Advertisement -

లేటెస్ట్ గా కోలివుడ్ తో పాటు టాలీవుడ్ ను కూడా ఒక ఊపు ఊపేస్తున్న సినిమా సూర్య నటించిన 24. ఇష్క్, మనం లాంటి బ్యూటిఫుల్ సినిమాలు తీసిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ప్రస్తుతం కొత్త దర్శకులతో పాటు టాప్ డైరెక్టర్స్ కూడా ఇలాంటి కథలను తెరక్కించాలని కోరుకుంటున్నారట.

కాగా వీరిలో సుకుమార్ కూడా ఉన్నాడు. టాలీవుడ్ లో అందరికన్నా ఎక్కువ ఇంటలీజెంట్ దర్శకుడిగా పేరున్న సుకుమార్ కెరీర్ స్టార్టింగ్ లోనే ఓ అద్బుతమైన సైన్స్ ఫిక్షన్ సినిమా కథను రాసుకున్నాడట, కానీ అది తెలుగులో నడుస్తుందో లేదో అన్న డౌట్ తో బయటికి తీయని సుకుమార్ ఇప్పుడు సూర్య 24 కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆ కథని పట్టిన బూజుని దులపాలి అని ఫిక్స్ అయ్యాడట.

ప్రస్తుతం రామ్ చరణ్ తో కొత్త సినిమా చేయబోతున్న సుకుమార్ ఆ కథకి బదులు తను రాసుకున్న సైన్స్ ఫిక్షన్ కథను చెప్పగా రామ్ చరణ్ వెంటనే ఆ సినిమానే చేద్దామని చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరు 150 నిర్మిస్తూ తనీఒరువన్ రీమేక్ లో నటిస్తూ బిజీగా ఉన్న రామ్ చరణ్ ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -