Monday, May 6, 2024
- Advertisement -

Mega 157..ఎందుకింత హైప్!

- Advertisement -

వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఆచార్య కంటే ఫ్లాప్‌ని మూటగట్టుకుంది. అయితే భోళా శంకర్ సినిమా చేస్తున్న సమయంలోనే మరిన్ని సినిమాలకు కమిట్ అయ్యారు మెగాస్టార్.

ఇందులో ఒకటి బింబిసార దర్శకుడు వశిష్టతో. వాస్తవానికి బింబిసార సీక్వెల్‌కి కథను సిద్ధం చేస్తున్న వశిష్టకు అనుకోని విధంగా చిరుతో సినిమా ఛాన్స్ వచ్చింది. ఇక ఇప్పటికే టైటిల్ పోస్టర్‌తో భారీ హైప్ క్రియేట్ చేశారు. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌ చేశారు.

ఇక ఈ సినిమాలో చిరు తన వయస్సుకు తగ్గ పాత్ర చేస్తున్నారట. ఇదే ఫార్ములాను ఫాలో అయ్యి రజనీకాంత్ సక్సెస్ కూడా సాధించాడు. జైలర్‌తో బాక్సాఫీస్‌ని కొల్లగొట్టారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను మెగాస్టార్ ఫాలో అవుతుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్లు ఉంటారు కానీ రొమాన్స్‌ సీన్స్ ఉండవు. ఇదొ ఫాంటసీ సినిమా.. ఆ జానర్‌కు తగ్గట్లే సినిమా నడుస్తుందని వశిష్ఠ వెల్లడించారు.

గతంలో జగదేక వీరుడు అతిలోక సుందరి అనే ఫాంటసీ సినిమా చేశారు చిరు. ఇది ఇండస్ట్రీ ఆల్ టైం హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.తాజాగా మరోసారి ఫాంటసి సినిమాతో చిరు వస్తుండటంతో హైప్ పెరిగిపోయింది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -