Sunday, April 28, 2024
- Advertisement -

మంచి ఛాన్స్ మిస్ చేసిన టిమిండియా..

- Advertisement -

మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఆసీస్ విధించిన భారీ లక్ష్య ఛేదనలో భారత్ 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (57 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ (56; 5 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించినా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. వాషింగ్టన్‌ సుందర్‌ (18), కేఎల్‌ రాహుల్‌ (26), సూర్యకుమార్‌ యాదవ్‌ (8) విఫలంకాగా శ్రేయస్‌ అయ్యర్‌ (48),జడేజా(35) పర్వాలేదనిపించాడు.

అంతకముందు తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. మిషెల్‌ మార్ష్‌ (84 బంతుల్లో 96; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా.. స్టీవ్‌ స్మిత్‌ (74; 8 ఫోర్లు, ఒక సిక్సర్‌), మార్నస్‌ లబుషేన్‌ (72; 9 ఫోర్లు), డేవిడ్‌ వార్నర్‌ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. మ్యాక్స్‌వెల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ , శుభ్‌మన్‌ గిల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు దక్కాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -