డీజే-దువ్వాడ జగన్నాధం.. ఈ సినిమా టాలీవుడ్ తరఫున యూట్యూబ్ సెన్సేషన్ అని చెప్పాలి. డీజే టీజర్ విడుదల అయ్యి పది రోజులు కూడా గడవక ముందే.. ఇప్పటికే 7 మిలియన్ల వ్యూస్ దాటేసింది. అయితే.. దీని కంటే ఈ టీజర్ కు వచ్చిన డిజ్లైక్స్ ఇంకా పెద్ద సెన్సేషన్.
ఇప్పటికి 1.28 మిలియన్ల డిజ్లైక్స్ ఈ టీజర్ కు వచ్చాయి. అంతకు మించిన లైక్స్ ఉన్నా.. ఓ తెలుగు సినిమా టీజర్ కి ఈ స్థాయిలో డిజ్ లైక్ బటన్ నొక్కడం మాత్రం ఇదే తొలిసారి. ఇందుకు కారణం.. పవన్ ఫ్యాన్స్ అనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. చెప్పను బ్రదర్ తర్వాత అల్లు అర్జున్ విషయంలో పవన్ ఫ్యాన్స్ గరంగరంగా ఉన్నారు. వివాదాన్ని రూపుమాపేందుకు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఆ బాధ్యతను అల్లు అరవింద్ తన భుజాలపై వేసుకున్నారని తెలుస్తోంది.
తమ కుటుంబంలో విబేధాలు లేవని చాటేందుకు ప్రయత్నిస్తున్నారట అరవింద్. ఇందుకోసం.. డీజే మూవీలోని ఓ పాటను పవన్ చేతుల మీదుగా విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్-అరవింద్ ల మధ్య గత అనుబంధం ఇందుకు ఉపయోగపడనుండగా.. ఇప్పుడు ఈ విషయంలో చిరు హెల్ప్ కూడా అల్లు డ్యాడీ తీసుకున్నట్లు టాక్. నిజంగానే డీజే సినిమాలోని పాటను.. పవన్ తో రిలీజ్ చేయిస్తే మాత్రం.. ఈ మూవీకి బోలెడంత పవర్ దక్కినట్లే.
{youtube}gutv4DdKoCw{/youtube}
Related