ప్రస్తుతం అల్లు అర్జున్ మంచి జోష్ మీద ఉన్నాడు. చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ కాస్తా మరింత పెరిగిపోయింది. ఇక బన్నీ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే-దువ్వాడ జగన్నాధంను సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లింగుస్వామితో ఓ మూవీ ఉంటుందని అనౌన్స్ చేశాడు.
ఇంకోవైపు వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ను కూడా చేయబోతున్నట్లు తెలిసిన విషయమే. అయితే.. లింగుస్వామి మూవీ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట. ఈ మూవీని ఇప్పుడు రద్దు చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ నుంచి ఈ సినిమాకి ఎలాంటి తేడాలు లేకపోయినా.. దర్శకుడు-నిర్మాతల మధ్య కొన్ని విబేధాలు తలెత్తాయట.
వీటిని పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు. అయితే.. ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసుకున్నారా.. లేక హోల్డ్ లో ఉంచారా.. అనే విషయం మాత్రం తేలలేదు. ఇక లింగుస్వామి సినిమా మొదలు అయ్యే చాన్స్ లేకపోవడంతో తన పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 8నుంచి ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ స్టార్ట్ చేయాలని స్టైలిష్ స్టార్ డిసైడ్ అయ్యాడట.
Related
