టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు డ్రగ్స్ కుంభకోణం కలవరపెడుతోంది. ఇందులో పెద్ద పెద్ద స్టార్స్ ఉండటం గమనార్హం. టాలీవుడ్ స్టార్స్ ఇందులో ఉండటం ఇప్పుడు అందరినీ షాక్ చేస్తోంది. అయితే దీనికంతటికి సూత్రధారి కెల్విన్ అని చ్పుతున్న పోలీసులు.. అసలు వ్యక్తులు ఎవరో చెప్పకుండానే టాలీవుడ్ స్టార్స్ పేర్లు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. ఈ డ్రగ్స్ కేసులో ముఖ్య పాత్రదారుడిగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ దర్శకుడికి నోటిసులు అందినట్లు సమాచారం. అయితే పూరీ శిష్యులే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్లుగా తెలుస్తుంది. ఆయన చుట్టూ ఉండే వారి పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అందుతున్న సమాచారం మేరకు.. పరిశ్రమలో పేరుగాంచిన నిర్మాతాల తనయులు ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. దగ్గుబాటి ఫ్యామిలో కూడా ఒకరు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా ఇప్పుడిప్పుడే వెల్లడవుతోంది. కావాలనే కొందరి పేర్లు మాత్రమే బయటపెట్టారు,అందరి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. దగ్గుబాటి కుటుంబం,అల్లువారి కుటంబం,మంచు వారి కుటుంబంలో కూడా డ్రగ్స్ తీసుకునే వారున్నారని,కావాలనే వారిపేర్లను బయటకు రానివ్వటం లేదని ప్రముఖ డైరెక్టర్ మీడియాను ప్రశ్నించినట్లుగా సమాచారం. మరి వాళ్ల పేర్లు ఎందుకు బయటకు రాకుండా మీడియా దాస్తుందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
- Advertisement -
డ్రగ్స్ కేసులో వెంకీ ఫ్యామిలీ..? అసలు నిజం ఏంటి..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -