Thursday, April 25, 2024
- Advertisement -

ఇక మత్తు వదలాల్సిందే.. సర్కారు కీలక నిర్ణయం

- Advertisement -

తెలంగాణలో కొన్నాళ్లుగా డ్రగ్ మాఫియా రెచ్చిపోతున్నది. విచ్చలి విడిగా విదేశీ ముఠాలు మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారు. తరుచుగా సినీ ప్రముఖులు డ్రగ్స్ వార్తల్లో నిలుస్తున్నారు. ఎంతోమంది విద్యార్థులు, యువత సైతం మత్తుకు చిత్తువుతున్నారు. దీంతో ప్రభుత్వం మత్తు పదార్థాల నియంత్రణను సీరియస్ గా తీసుకుంది.

ఈ మేరకు ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర రావు ప్రగతి భవన్లో సీఎస్, డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు . సమావేశంలో డ్రగ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డ్రగ్ మాఫియాపై ఉక్కుపాద మోపాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మత్తు మాఫియాను కట్టడి చేసుందుకు నార్కోటిక్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో పోలీసు, ఎక్సైజ్ శాఖల నుంచి దాదాపు 1000 మంది పోలీసులను నియమించనుంది. నార్కోటిక్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ కు ఐజీ స్థాయి అధికారిని నియమిస్తారు. ప్రతి పోలీసు స్టేషన్ కు డ్రగ్స్ నిందితుల సమాచారం అందేలా యాప్ ను రూపొందించనున్నారు.

Also Read: రెండు మూడు వారాల్లో పీక్ లెవల్ కు ఒమిక్రాన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -