ప్రస్తుతం టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప రాజ్ గా మాస్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీలో ప్రతి పాత్ర పట్ల స్పెషల్ కేర్ తీసుకొని ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఈ మూవీలో ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా సందడి చేస్తోంది. ఈ మూవీకి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
Also read:ఆ ఫొటో చిరునవ్వులు తెప్పించింది: నమ్రత
సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఐటెం సాంగ్ అంటే ఏ రేంజ్లో ఉంటాయో ఇదివరకే మనం చూశాం. తాజాగా వీరి కాంబినేషన్లో పుష్పా సినిమాలో ఐటమ్ సాంగ్ అద్భుతంగా వచ్చిందని, దేవి శ్రీ ప్రసాద్ మంచి లిరిక్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ మాస్, క్లాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించే విధంగా ఉంటుందని ఇప్పటికే ఈ పాటను రికార్డ్ చేశారని తెలుస్తోంది.ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిన విషయం మనందరికీ తెలిసిందే. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక తిరిగి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
