కోన వెంకట్. టాలీవుడ్లో కాస్ట్ లీ రైటర్.ఈయనగారు ఏం రాస్తే అదే కౌంటర్ .పంచ్ లతో ఈ మధ్యన కోన వెంకట్ చెలరేగిపోతున్నాడు. అలాంటి కోనసార్ కు నెటిజన్ల గట్టిగానే కొంటౌర్లు ఇచ్చారు.దీంతో సార్ అలిగారు.ఇదంతా ఆయన గారు రెగ్యులర్ గా టచ్ లో ఉండే సోషల్ మీడియాలో జరిగింది.శంకరాభరణంకి సెన్సార్ పూర్తి అయ్యాక ఆ ఉత్సాహంలో సారు ఫస్ట్ రిలీజ్ డేట్ పోస్టర్ ని విడుదల చేశాడు. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు మా సినిమా వస్తున్నట్లు చెప్పాడు.
అక్కడితో ఊరుకోకుండా… సోషల్ మీడియాలో… డిసెంబర్ 4న వస్తున్న నా శంకరాభరణం చిత్రానికి రచయిత రాసినందుకు నిర్మాతగా సమర్పించినందుకు సగర్వంగా ఉందన్నాడు .ఇక్కడే మనోడు నెటిజన్లకు దొరికిపోయాడు.అక్కడితో ఊరుకోకుండా ఓ జెన్యూన్ అటెంప్ట్ అంటూ ట్వీట్ కూడా చేశాడు.రీమేక్ సినిమాను తాను డైరెక్ట్ గా రాసిన చిత్రంగా కోన ఎలా అనుకుంటాడంటూ కామెంట్ బాక్స్ లు నిండిపోతున్నాయి.
కోన ఈ తరహా ట్వీట్ చేసిన వెంటనే.. నెటిజన్ల నుంచి భలే చిత్రమైన స్పందన వచ్చింది. ఇది బాలీవుడ్ మూవీ ఫస్ గయారే ఒబామాకి రీమేక్ అని ఈయనగారే చెప్పారు.అలాంటిది రీమేక్ కి కొత్తగా రాయడమేంటి అని డైరెక్ట్ గానే సారుని మళ్లీ ప్రౌడ్ గా ఫీలవుతున్నానని అంటారేంటి అని ప్రశ్నించారు.దీంతో కోనకి ఎక్కడలేని కోపం వచ్చింది.ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే చిర్రెత్తికొచ్చింది.ఇలాంటి అసహనం వ్యతిరేకత చూస్తే బాధేస్తోందని తనకు నచ్చిన వాళ్లనే ఫాలో అవుతానన్న కోన వెంకట్.. ఇలాంటి కామెంట్స్ రాస్తే….మిమ్మల్ని బ్లాక్ చేసే అవకాశం తనకివ్వద్దంటూ…..తాను సినిమాల్లో చెప్పే డైలాగ్ లను తనదైన రైటర్ స్టయిల్లో ట్వీట్ రూపంలో చెప్పాడు.మరి ఇలాంటి డైలాగ్లు సినిమాల్లో వర్కవుట్ అవుతాయి గాని రియల్ లైఫ్లో వర్కవుట్ అవ్వవు కదా.
ఎక్కడైనా ఒక ఒరిజినల్ చిత్రాన్ని తీసుకుని దానికి ఎంతటి హంగులు అద్దినా.. దాన్ని మనం రీమేకే అని అంటాం. కోనసార్ మాత్రం టైటిల్స్ లో కథకు తన పేరు వేసుకుంటానంటున్నాడు.అలా చేస్తే ఇలాంటి కొశ్చన్సే తలెత్తుతాయి.
ఇలాంటి సందర్బంలో కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి లేదంటే కామ్ గా కూర్చోవాలి.ఇలా అడిగితే మిమ్మల్ని బ్లాక్ చేస్తానని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ .పైగా ట్విట్టర్ లో ఇలాంటివి కామనే అనే విషయం ఈయనగారికి తెలియంది కాదు.ఏది ఏమైనా శంకరాభరణ రాగం కాస్త శృతి మించినట్లుగానే కనిపిస్తుంది.