అతడికి నరకం చుపిస్తానన్న బెల్లంకొండ

- Advertisement -

సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కుమారుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది.నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వలేదంటూ బెల్లంకొండ సురేష్, ఆయన కుమారుడు శ్రీనివాస్‌పై శ్రవణ్ అనే ఫైనాన్సియర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

ఈ వ్యవహారంపై బెల్లంకొండ సురేష్ స్పందించారు. ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రవణ్ ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టాడని విమర్శించారు. కొందరు అతడి వెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నారన్నారు. శ్రవణ్‌ను వదిలేదని లేదన్నారు. అతడిపై పరువు నష్టం దావా వేస్తాననీ.. క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు.

ఓ రాజకీయ నేత ఈ వ్యవహారాన్ని వెనక ఉండి నడిపిస్తున్నారనీ..అతను ఎవరో తనకు తెలుసన్నారు.లీగల్‌గా శ్రవణ్‌కు నరకం చూపిస్తాననీ ఎవరినీ వదిలిపెట్టేదే లేదన్నారు. బెల్లంకొండ సురేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

పూజా హెగ్డే పాటకు రష్మిక రచ్చ రచ్చ

మళ్లీ కదిలిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు డొంక

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -