Sunday, May 26, 2024
- Advertisement -

ఎన్టీఅర్ అభిమానులు పండగ చేసుకునే వార్త!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకేక్కిన చిత్రం నాన్నకు ప్రేమతో. ప్రస్తుతం ఈ సినిమా కలక్షన్స్ వసులు చేస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈసినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్ హీరోయిన్‍గా నటించింది. ఈ చిత్రం రిలీజ్ అయ్యినదగ్గర నుంచే పాజీటివ్ టాక్‍తో దూసుకేలుతుంది.

ఈ చిత్రం యూఎస్‍లో కూడా మంచి వసులు రాబట్టుతుంది. అయితే ఎన్టీఆర్ ఇప్పటి వరకు చాలా సినిమాలే చెసాడు కానీ ఏ సినిమా కూడా యాభై కోట్ల షేర్‌ దాటలేదు. ఖచ్చితంగా ఎన్టీఆర్ కు మంచి సినిమా పడితే యాభై కోట్ల షేర్‌ దాటగలడు అని నిరుపించింది నాన్నకు ప్రేమతో. సంక్రాంతి బరిలో ఒకేసారి నాలుగు సినిమాలు రావాడంతో సినిమాల మధ్య పోటి ఉండటం వల్ల  నాన్నకు ప్రేమతో యాభై కోట్ల షేర్‌ దాటదు అనుకున్నారు.

కానీ ఎన్టీఆర్ తన స్టామీనా ఎంటో చూపించాడు. మొత్తానికి నాన్నకు ప్రేమతో సినిమా మంచి కలెక్షన్లతో యాభై కోట్ల షేర్‌ చేరుకోగలిగింది. నాన్నకు ప్రేమతో సినిమా సంగతి ఎలా ఉన్న ఎన్టీఆర్ సినిమా కూడా యాభై కోట్లు వసులు చేయగలదు అని నిరుపించింది. మొత్తానికి ఈ వార్త తెలుసుకున్న ఎన్టీఅర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్‌ అనే సినిమా చేయబోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -