Saturday, April 27, 2024
- Advertisement -

ఎట్టకేలకు దిగొచ్చిన మన్సూర్..!

- Advertisement -

ఎట్టకేలకు దిగొచ్చారు నటుడు మన్సూర్ అలీఖాన్. నటి త్రిషతో రేప్ సీన్ చేసే ఛాన్స్ తనకు రాలేదని వ్యాఖ్యానించి వివాదానికి కేరాఫ్‌గా నిలవగా ఇండస్ట్రీ మొత్తం త్రిషకు బాసటగా నిలిచింది. ఇక ఈ వివాదం పెద్దదైన తర్వాత కూడా ఎక్కడా తగ్గలేదు మన్సూర్.

తాను క్షమాపణ చెప్పేది లేదని..తాను నొరువిప్పితే పెద్ద పెద్ద హీరోలు బయటికొస్తారని చెప్పారు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు ఈ స్టేట్ మెంట్ ఇచ్చిన 24 గంటల్లోనే త్రిషకు సారీ చెప్పి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు మన్సూర్.

ఒక వారం పాటు నేను ఆయుధం లేకుండా యుద్ధం చేశాను. ఈ యుద్ధంలో నేను రక్తపాతం లేకుండానే గెలిచాను. ఈక్రమంలో నాకు అండగా నిలిచిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నన్ను తప్పుపట్టిన వారికీ నా వినయపూర్వక నమస్కారమలు…. ఇక నా వ్యాఖ్యలతో బాధపడ్డ త్రిషకి క్షమాపణలు తెలియజేస్తున్నాను అన్నారు. త్రిష పై తనకి ఎలాంటి చెడు ఉద్దేశం లేదని…ఆమె పెళ్లికి తాను మంగళసూత్రం అందించి ఆశీర్వదించాలని అనుకుంటున్నట్లు తెలపగా త్రిష సైతం పాజిటివ్‌గానే స్పందించారు. తప్పు చేయడం మానవ సహజం. క్షమాపణ అనేది దైవ గుణం అంటూ చెప్పుకొచ్చింది త్రిష.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -