Monday, April 29, 2024
- Advertisement -

గామి..సెన్సార్ టాక్ అదుర్స్!

- Advertisement -

విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గామి. మహా శివరాత్రి కానుకగా 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి సైతం సినిమాపై ప్రశంసలు గుప్పించడంతో మరింత హైప్ క్రియేట్ అయింది.

తాజాగా సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సినిమా బాగుందని సెన్సార్ సభ్యులు కితాబివ్వగా రన్ టైంని గంట 48 నిమిషాలు లాక్ చేశారు. అలాగే సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్. మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న అఘోర శంకర్‌ హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్రం అని తెలస్తోంది.

విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా అభినయ, మహ్మద్ సమద్, హారిక పెడద, దయానంద్ రెడ్డి, శాంతి రావు, మయాంక్ పరాఖ్, జాన్ కొట్టోలీ, బొమ్మ శ్రీధర్, రజనీష్ శర్మ, శరత్ కుమార్ తదిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -