కొన్ని రోజులుగా రిలీజ్ కు రెడీకి ఉన్న సినిమాలూ ఈ రోజు రిలీజ్ అయ్యాయి. అందులో ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలు గరుడ వేగ, నెక్ట్స్ నువ్వే, ఏంజెల్. ఈ మూడు సినిమాలో చేసినవారికి.. ఇవి హిట్ అవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారు హిట్ లేక బాధపడుతున్నావారే.
అందుకే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని వారి కొత్త సినిమాలు గరుడ వేగ, నెక్ట్స్ నువ్వే, ఏంజెల్ తో వచ్చారు. అయితే ఇందులో ముందుగా గరుడ వేగ విషయంకు వస్తే.. ఈ సినిమా మొత్తం అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు ప్రవీణ్ సత్తార్. ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉండగా… సెకండాఫ్ కొంచెం స్లో అయింది. మొత్తంగా ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. రాజశేఖర్ కెరీర్ లో సినిమా హిట్ అయిపోయింది. ఇక నెక్ట్స్ నువ్వే సినిమా విషయంకు వస్తే.. ఈ సినిమాలో బ్రహ్మాజీ కామెడీ బాగున్న.. ఈ సినిమా కథనం అసలు బాగాలేదు.
చెప్పాల్సింది వదిలేసి… అనవసరపు సీన్లు, పాత్రలు సినిమాలో ఎక్కువ అయ్యాయి. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పిస్తుందని చెప్పలేం. ఇక మరో సినిమా ఏంజెల్ విషయంకు వస్తే.. నాగ అన్వేష్ కథానాయకుడిగా హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించారు. సోషియో ఫాంటసీ గా తెరకెక్కిన ఈ సినిమాలో నటినటులు పర్వాలేదు అనిపించిన రొటిన్ కథ కావడంతో.. ప్రేక్షకుడు ఈ సినిమాకి కనెక్ట్ అవుతాడని చెప్పలేం. మరి గరుడ వేగ సినిమా హిట్ ఖాతలోకి వెళ్లింది. ఇక మిగిలిన రెండు సినిమాల పరిస్థితులు ఎలా ఉంటుందో చూడాలి.