- Advertisement -

‘గరుడ వేగ’ ఫస్ట్ డే కలెక్షన్స్ కి రాజశేఖర్ షాక్.. ఆనందంలో మూవీ టీం

- Advertisement -

‘గరుడ వేగ’ మూవీ పై ముందు నుంచి.. మంచి అంచనాలే ఉన్నాయి. అయితే రాజశేఖర్ కి కొన్ని ఏళ్లుగా మంచి హిట్ సినిమా లేదు. దాంతో ఈ సారి యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తో సినిమా చేశాడు. దర్శకుడు బాగా తీస్తాడు అనే నమ్మకం ఉండటం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి.

అనుకున్నట్లుగానే ‘గరుడ వేగ’ రిలీజ్ అయ్యి దుమ్ము దులిపేసింది. హాలివుడ్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ స్పై థ్రిల్లర్ అలరించడంతో ప్రీమియర్స్ షోతోనే విపరీతమైన పాజిటివ్ టాక్ మూటగట్టుకుంది. దీంతో.. ఈ చిత్రం చూసేందుకు థియేటర్లకు జనాలు బారులు తీరారు. ఫలితంగా.. ఈ చిత్రం కలెక్షన్లు వర్షం కురిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 225 సెంటర్లలో రిలీజైన ఈ సినిమా.. రూ.2.35 కోట్ల గ్రాస్, రూ.1.62 షేర్ కలెక్ట్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది రాజశేఖర్, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కెరీర్‌లలో హయ్యెస్ట్ ఫిగర్. ఓ స్పై థ్రిల్లర్ మూవీకి ఈ రేంజులో రెస్పాన్స్ రావడం నిజంగా విశేషం. అయినా ఇది కేవలం అంచనా మాత్రమే.. ఆ ఫిగర్ మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇప్పుడెలాగో పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.. రెండో రోజు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని, పైగా వీకెండ్ కూడా కావడంతో ఊహకందని స్థాయిలోనే వసూళ్లు నమోదు కావొచ్చని చెప్తున్నారు. మొత్తానికి.. రాజశేఖర్ గ్రాండ్‌గానే రీఎంట్రీ ఇచ్చారన్నమాట. అయితే గరుడ వేగతో రిలీజ్ అయిన మరో రెండు సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు కాబట్టి ఆ సినిమాల స్థానంలో గరుడవేగను దింపేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఆలోచిస్తున్నారు. ఇది జరిగిగే ఈ సినిమా కలెక్షన్లు భారీగా పెరగనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -