Monday, May 6, 2024
- Advertisement -

బాబులొచ్చినా.. బాంబులొచ్చినా భయపడేది లేదు

- Advertisement -

దేశ రక్షణలో భాగంగా ఎందరో సైనికులు నిత్యం బాంబులతో చెలగాటమాడుతూ ఉంటారు. అనుకోకుండా వేసిన చిన్న చిన్న అడుగులు వారి జీవితాలను చిద్రం చేసేస్తుంటాయి. అలాంటి సందర్భాలలో బాధపడటం తప్ప మరేమి చేయలేం. మహా అయితే వీటిని ఎవరైనా ముందుగా గుర్తించి తీసేస్తే బాగుండు అనిపిస్తుంటుంది. అంతా భాగానే ఉంది కాని అలా జరిగే ఛాన్స్ లు చాలా తక్కువ. కారణం బాంబ్ డిస్పోజర్స్ మార్కెట్లో చాలా తక్కువమంది ఉన్నారు.

దీనితో రక్షణ రంగంలో ఉపాది కోసం వచ్చేవాళ్లు కూడా తగ్గిపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన రష్యన్స్ సరికొత్త స్యూట్ ను తయారుచేశారు. రష్యాకు చెందిన ఓ ఆయుధాల కంపెనీ తయారుచేసిన ఈ సూట్‌ను బుల్లెట్లు ఎన్ని వచ్చినా… ల్యాండ్‌మైన్లు పక్కన పేలి మంటలు ఎగిసినా కూడా ప్రమాదానికి గురి కాకుండా సైనికులను ఆ ఆర్మీ సూట్ రక్షణగా కాపాడుతుంది. తాజాగా దీనిని పరీక్షించేందుకు ఒక మహిళ సాహసం చేసింది కూడా.

ఈ వీడియోలో మీరు చూస్తోన్న ఆ మహిళ సూట్ వేసుకొని బాంబుల మధ్యన బెదరకుండా నడిచింది. పక్కనే ల్యాండ్‌మైన్లు పెళ్లి మంటలు చెలరేగినా ఎక్కడా బెదరలేదు. రాతి గుళ్లు ఎగసిపడ్డా కూడా ఆమెకు ఏమి కాలేదంటే విషయం అర్ధం చేసుకోవచ్చు. ఎట్ ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

https://www.youtube.com/watch?v=EJ4h6HkL7NA

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -