Sunday, April 28, 2024
- Advertisement -

త్రివిక్రమ్ బర్త్ డేకి పవన్ ఫ్యాన్స్ కి ఊహించని గిఫ్ట్

- Advertisement -

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అయన సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ కి సినిమాల ద్వారా కంటే ఆయన వ్యక్తిగతనే ఎక్కువ మంది అభిమానులను సంపాధించుకున్నాడు. అలానే టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఆయన ఇప్పటికే బ్లాక్ బస్టర్ సినిమాలు తీసారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసింది. అయితే ఈ చిత్ర విశేషాలకు అభిమానులు నిరీక్షణ కొనసాగుతోంది. ఎట్టకేలకు వారి పడిగాపులకు బ్రేక్ పడనుంది. త్రివిక్రమ్ పుట్టిన రోజున ఈ సినిమా యూనిట్ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనుందట. మొదట త్రివిక్రమ్ పుట్టిన రోజు అనగా నవంబర్ 7న పవన్ 25 వ చిత్ర టైటిల్ లోగోని అవిష్కరించనున్నారట.

తాజాగా త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ సాంగ్ ‘బైటికొచ్చి చూస్తే’ రిలీజ్ చేయబోతున్నారట. దీనితో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఈ విషయం నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. అనిరుద్ అందిస్తున్న సంగీతం ఎలా ఉంటుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ఇప్పటికే పవన్ పుట్టిన రోజు నాడు ఈ సాంగ్ బిట్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -