Monday, May 20, 2024
- Advertisement -

యూపీఏ హయాంలోనే అది సాధించాల్సింది ప్ర‌ధాని మోది

- Advertisement -

ప్ర‌ధాని మోదీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టినుంచి అభివృద్ధి ప‌నులు చేస్తుంటె ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఢిల్లీ ప్రవాసీ భారతీయ కేంద్రంలో శనివారం జరిగిన భారత వ్యాపార సంస్కరణల సదస్సులో మోదీ పాల్గొన్నారు.

ప్రపంచబ్యాంకు విడుదల చేసిన వ్యాపారానికి అనుకూల దేశాల జాబితాలో భారత్ ర్యాంకింగ్ గురించి ప్రస్తావించారు. ప్రపంచబ్యాంకు విడుదల చేసిన వ్యాపారానికి అనుకూల దేశాల జాబితాలోగత మూడేళ్లలో భారత్ 42స్థానాలు ముందుకెళ్లిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాది మే చివరి వరకు ఉన్న సంస్కరణలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను విడుదల చేశారని ఆయన చెప్పారు.

ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ అర్థిక విధానాల‌ను స‌క్ర‌మంగా అమ‌లు చేసి ఉంటె ఈపాటికి వారిహ‌యాలోనె ఈఘ‌న‌త సాధించి ఉండేద‌న్నారు. ఇప్పుడు చేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు’’ అంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు. ప్రపంచ బ్యాంక్‌ వారి పాలన సమయంలోనే ఈజ్‌ బిజినెస్ డూయింగ్ ర్యాంకులు ఇవ్వటం మొదలుపెట్టిందన్న మోదీ.. ఇప్పుడు ఆ విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తమ ప్రభుత్వం చేపట్టిన శ్రమను ప్రపంచబ్యాంక్ గుర్తించిందన్నారు. దేశీయ, విదేశీ పెట్టుబడిదారులను తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు ఆహ్వానిస్తున్నదని, కేవలం ఒక్క ఏడాదిలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ర్యాంక్ మెరుగుపడడం అద్భుతమన్నారు. దేశంలో జీఎస్టీ అమలు చేయడం వల్ల వ్యాపారాలు మరింత సులువైనాయని ప్రధాని అన్నారు. జీఎస్టీలో అవసరమైన మార్పులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

సులభతర వాణిజ్యానికి సంబంధించి 2004 నుంచి ప్రపంచ బ్యాంకు ర్యాంకులు ఇస్తోందని, 2014 వరకూ ఎవరు అధికారంలో ఉన్నారో అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. సాధించిన ప్రగతిపై విమర్శలు చేయడానికి బదులు ‘నవీన భారతం’ నిర్మాణంలో కలిసి రావాలని విపక్షాలకు ప్రధాని పిలుపునిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -