Sunday, May 12, 2024
- Advertisement -

వైన్ తాగితే వందేళ్ళు బ్రతకచ్చా..!

- Advertisement -

వందేళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలంటే చిన్న చిట్కా చెబుతున్నారు ప్రపంచంలోనే వృద్ద కవలలుగా పేరొందిన బెల్‌జియన్స్ పీటర్ మరియు పాలుస్ లాంగ్‌రాక్.

వీరు పుట్టిన తేది జులై 8, 1913. వీరిద్దరు ఇప్పటివరకు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటున్నారు. బెల్జియం పట్టణం పక్కన ఘెంట్ అనే వీదిలో ఒక నర్సింగ్ హోం‌మ్‌లో ఒక చిన్న గదిలో వీరు నివాసం ఉంటున్నారు. ఇప్పుడు వీరి వయసు ఎంతో తెలుసా 102 సంవత్సరాలు. ఇప్పటికి వీరిద్దరు చాలా బాగా మాట్లాడగలరు, పరుగెత్తగలరు. కంటి చూపు చాలా స్పష్టంగా ఉందంట. ఇన్ని సంవత్సరాలుగా ఇంత ఆరోగ్యంగా ఉండటానికి ఒకే ఒక్క కారణమం చెబుతున్నారు. 

అదేంటంటే..  క్రమం తప్పకుండా డైలి ఒక గ్లాస్  వైన్ తీసుకుంటారట. ఏది పడితే అది కాకుండా క్వాలిటీ వైన్ తీశుకుంటారట. ఇదే మా ఆరోగ్య రహస్యం అని ఒక టీవి చానల్‌లో  ఈ కవల వృద్దులు పేర్కొన్నారు. 

పాలుస్ లాంగ్‌రాక్ చెబుతున్నదేంటంటే.. నాకు 85 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు నాలుగు సంవత్సరాలు మాత్రమే జీవించగలవు అని డాక్టర్‌‍ చెప్పాడు. కానీ నాకు ఇప్పుడు 102 సంవత్సరాలు. ఇలా ఉండటానికి కారణం రోజూ మేమిద్దరం కలిసి ఒక గ్లాస్ మంచి క్వాలిటి వైన్ తీసుకోవడమే మా అరోగ్యరహస్యం అని ఈ వృద్ద కవలలు చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -