గాడ్ ఫాదర్ డబుల్ డోస్ !

God Father Sequel: Chiranjeevi Comments on God Father Goes Viral
God Father Sequel: Chiranjeevi Comments on God Father Goes Viral

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ” గాడ్ ఫాదర్ “. తని ఒరువన్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5 న విడుదల కానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు నటించిన గత చిత్రం ” ఆచార్య ” డిజాస్టర్ కావడంతో ” గాడ్ ఫాదర్ ” తో ఎలాగైనా హిట్ కొట్టాలని మెగాస్టార్ పట్టుదలగా ఉన్నారు. అందుకోసం మూవీ ప్రమోషన్స్ లో కూడా మెగాస్టార్ చురుకుగా పాల్గొంటూ అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మూవీ మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ” లూసిఫర్ ” కు రీమేక్ గా తెరకెక్కుతున్నప్పటికి.. కథలో చాలానే మార్పులు చేసినట్లు గతంలో డైరెక్టర్ మోహన్ రాజా చెప్పుకొచ్చారు.

మూవీ టీజర్, ట్రైలర్ ను బట్టి చూస్తే.. గాడ్ ఫాదర్ గా మెగాస్టార్ స్టైలిష్ లుక్ సినిమాకి మెయిన్ ప్లేస్ గా నిలిచే అవకాశం ఉనట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో మెగాస్టార్ తో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో గాడ్ ఫాదర్ పై అటు బాలీవుడ్ లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరు చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. గాడ్ ఫాదర్ కు సిక్వల్ ఉండే అవకాశం ఉందని చిరు హింట్ ఇచ్చాడు. దీంతో గాడ్ ఫాదర్ పార్ట్ 2 కూడా రాబోతుందా అని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గాడ్ ఫాదర్ సిక్వల్ గురించి చిరు అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఏది ఏమైనప్పటికి గాడ్ ఫాదర్ రిలీజ్ కు ముందే సిక్వల్ ప్రస్తావన తెరపైకి రావడంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది.

Also Read

ఆదిపురుష్ పై ప్రభాస్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ !

వీరి జోడీ.. భలే బాగు!