Monday, May 13, 2024
- Advertisement -

గ్రామ సచివాలయాలను రద్దు చేస్తే ప్రజలు ఒప్పుకుంటారా ?

- Advertisement -

ప్రస్తుతం దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారు ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ముందు సచివాలయ వ్యవస్థను ప్రత్యేకంగా నొక్కి చెప్పిన జగన్.. అన్నట్టుగానే అధికరంలోకి వచ్చిన వెంటనే మండల స్థాయి కార్యకలాపాలను సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయికి తీసుకొచ్చారు. ఇక ఈ సచివాలయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రజలు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, మండల కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింది. సొంత గ్రామంలోనే ప్రజలకు కావలసిన అన్నీ పనులు జరుగుతుండడంతో ప్రజలు సచివాలయ వ్యవస్థను అనూహ్యంగా స్వాగతించారు.

ప్రస్తుతం వైఎస్ జగన్ పరిపాలనపై వ్యతిరేకత ఎంత మేర ఉందో తెలియదు గాని.. ఆయన ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా మాత్రం ఎంతో ఉపయోగకరంగా ఉందనేది ఎవరు కాదనలేని వాస్తవం. అయితే గ్రామస్థాయిలో విస్తృతంగా పాతుకుపోయిన ఈ సచివాలయ వ్యవస్థ ధీర్ఘకాలికంగా కొనసాగుతుందా ? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నిరాటంకంగా ఈ వ్యవస్థను కొనసాగించే అవకాశం ఉన్నప్పటికి.. వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పును బట్టి అధికరంలోకి వచ్చే పార్టీ ఈ సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తుందా ? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ అధికరంలోకి వచ్చే ఈ వ్యవస్థ కొనసాగే అవకాశం ఉంది. అలా కాకుండా వేరే ఏ ఇతర పార్టీ అధికరంలోకి వచ్చిన సచివాలయ వ్యవస్థ ఉంటుందన్న గ్యారెంటీ లేదు.

ఎందుకంటే టీడీపీ అధికరంలోకి వస్తే సచివాలయ వ్యవస్థ ఉండదని.. వాటి స్థానంలో తిరిగి జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉండని ఇటీవల ఓ వార్తా టీడీపీ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే వాలెంటరీ వ్యవస్థను రద్దు చేస్తామని టీడీపీ శ్రేణులు ఆయా సందర్భాల్లో చెప్పుకొస్తున్నారు. ఇక గ్రామస్థాయిలో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న సచివాలయ వ్యవస్థను కూడా రద్దు చేస్తే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. మరి టీడీపీ హయాంలో ప్రకటించిన అమరావతి రాజధానిని జగన్ మార్చేందుకు సిద్దమవ్వడం.. అలాగే తాము అధికారంలోకి వస్తే జగన్ ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తామని టీడీపీ శ్రేణులు చెప్పుకురావడం.. ఇవ్వన్ని చూస్తుంటే రాజకీయంగా ఒకరికొకరు పైచేయి సాధించేందుకు తప్పా.. ప్రజలకు ఉపయోగకరంగా ఏ మాత్రం ఆలోచించడం లేదనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.

Also Read

యాక్టర్ vs మాస్ లీడర్

ఎన్నికల షెడ్యూల్ విడుదల.. సమరానికి సై !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -