Saturday, May 18, 2024
- Advertisement -

బాహుబలిని బద్దలుకొట్టే సినిమా అదేనట!

- Advertisement -

తెలుగు లోనే కాకుండా అన్ని భాషల్లో బాహుబలి సినిమా ఏ రెంజ్ లో రికార్డ్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ సినిమాతో తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. సినిమా షూటింగ్ దగ్గరి నుండి అన్నింటా బాహుబలి రికార్డుల మోత మోగించింది. ఇక సినిమా విడుదల తర్వాత రాబట్టిన కలెక్షన్ల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.

ఎవరు ఊహించని విధంగా ఈ చిత్రం కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు తాజాగా మరో సౌత్ ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాయడానికి వస్తోందని అందరూ చర్చించుకుంటున్నారు. రావడం కాస్త లేటైనా కానీ రికార్డులు మాత్రం తుడిచిపెట్టుకుపోతాయి అని అందరూ అనుకుంటున్నారు. ఆ సినిమా ఏదంటే..

ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ కబాలీ. చాలా కాలం తర్వాత కేవలం తన ట్రైలర్ తోనే రికార్డులు బద్దలుకొట్టిన రజినీ ఈ సారి బాహుబలి రికార్డులను కూడా బద్దలుకొట్టడం ఖాయం అంటూ సినీ జనాలు అనుకుంటున్నారు. అంతకు ముందు రజినీ సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమా మీద కూడా చాలా మంది అంచనాలు లేవు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం భారీగా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఎంత రేటైనా సరే పెట్టి కొనడానికి బయ్యర్లు ముందుకు వస్తున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాహుబలి కలెక్షన్ల రికార్డును బద్దలుకొట్టే సత్తా ఒక్క రజినీకి మాత్రమే ఉంది అని ఆయన అభిమానులు అంటున్నారు.

{youtube}v=HfRQOc9WgnY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -