Thursday, May 2, 2024
- Advertisement -

ఓ ఏడాది తర్వాత వస్తాం – ఎపి ఉద్యోగులు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ‌్య రోజురోజుకు చిచ్చుపెరిగిపోతోంది. ఈ నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాలు తయారవుతాయని, ఉద్యోగులంతా విధిగా అక్కడకు రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. మరోవైపు ఉద్యోగులు మాత్రం ఒక్క ఏడాది గడువు ఇవ్వాలని, ఇప్పటికిప్పుడు రాలేమని అంటున్నారు.

దీంతో అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు మధ‌్య పీటముడి పడింది. ఉద్యోగులంతా అమరావతి రావాల్సిందేనని, ఒకరిద్దరికి వ్యక్తిగత ఇబ్బందులుంటే వారికి మినహాయింపు ఉంటుంది తప్ప అందరూ రావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరాఖండీగా చెబుతున్నారు. ఉద్యోగులు మాత్రం వెళ్లేది లేదని, దీన్ని ఎలాగైనా ఆపాలంటూ ప్రతిపక్షాలు, అధికార పక్షానికి మిత్రపక్షమైన బిబెపి నాయకుల వెంట పడుతున్నారు.

శుక్రవారం నాడు కొంతమంది ఉద్యోగులు బిజపి నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరిని కలిసి గడువు ఇప్పించాల్సిందిగా కోరారు. ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -