Thursday, May 2, 2024
- Advertisement -

అద్దంకి దయాకర్‌కు ఈసారి హ్యాండేనా?

- Advertisement -

36 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ నుండి నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా మహబూబ్ నగర్ స్థానం నుండి వంశీచంద్ రెడ్డి పేరును హోల్డ్‌లో పెట్టింది. అయితే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆచితూచి అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది.

ఇక సీట్లు ఆశీస్తున్న వారిలో సీనియర్ నేతలు ఉన్నారు. ఖమ్మం నుండి వీ హన్మంతరావు, నాగర్‌కర్నూల్ నుండి మల్లు రవి, వరంగల్ నుండి అద్దంకి దయాకర్ సీట్లు ఆశీస్తున్నారు. ఇక ఎంపీ సీటు కోసం మల్లు రవి ఏకంగా ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు కూడా. అయితే ఈసారి ఈ ముగ్గురికి హ్యాండ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రధానంగా అద్దంకి దయాకర్‌ పరిస్థితి అయితే మరీ దారుణం. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి సీటు ఆశీంచగా చివరకు బీఆర్ఎస్‌ నుండి వచ్చిన మందుల సామ్యేలుకు దక్కింది. ఆ తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బల్మూరు వెంకట్, మహేష్ గౌడ్ ను ఎంపిక చేయగా తొలి నుండి వినబడ్డ పేరు అద్దంకిదే. కానీ చివరి నిమిషంలో మహేష్‌ గౌడ్‌ను చేర్చి అద్దంకిని తప్పించారు. అయితే ఆ సమయంలో దయాకర్‌కు వరంగల్ ఎంపీ సీటు ఖాయమని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే ఆసారి అద్దంకికి నిరాశే మిగలనుందని టాక్‌. సో మొత్తంగా పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డ ఈ ముగ్గురు నేతలకు సీటు రాకపోతే వీరి నెక్ట్స్ స్టెప్ ఏంటా అని పార్టీ శ్రేణులు ఎదరుచూస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -