- Advertisement -
సినీ పరిశ్రమలో మరో జంట విడిపోయింది. 11 ఏళ్ల వివాహ బంధానికి బ్రేకప్ చెప్పారు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ – సైంధవి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు జీవీ. ఎంతో ఆలోచించాం.. చివరికి విడిపోవాలని తాను, సైంధవి నిర్ణయించుకున్నామని … పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇలాంటి సమయంలో మా గోపత్యకు భంగం కలిగించకుండా మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నాం అని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
జీవీ ప్రకాష్..ఆస్కార్ గ్రహిత ఏఆర్ రెహమాన్ మేనల్లుడు. 2013లో తన చిన్ననాటి స్నేహితురాలు గాయని సైంధవిని ప్రేమించి పెళ్లిచేసుకోగా వీరిద్దరికి అన్వీ అనే కూతురు ఉంది.