ర‌హ‌స్యంగా ఆప‌రేష‌న్ చేయించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్‌

- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన కొమ‌రం పులి సినిమాలో హీరోయిన్‌గా ప‌రిచియం అయింది నికిషా ప‌టేల్‌. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌గా నిల‌వ‌డంతో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. క‌ల్యాణ్ రామ్‌తో క‌లిసి ఓం సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా న‌టించిన‌ప్ప‌టికి ఈ సినిమా కూడా విజ‌యం సాధించ‌లేదు. దీంతో త‌మిళ ఇండ‌స్ట్రీకి షిఫ్ట్ అయింది. ఈ క్రమంలో ‘తలైవన్‌’, ‘కరైయోరం’, ‘నారదన్‌’, ‘భాస్కర్‌ ఒరు రాస్కెల్’ వంటి చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. నికిషా ప‌టేల్ ప్ర‌స్తుతం జీవీ ప్రకాష్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తుంది.

అయితే సినిమా షూటింగ్‌కి కాస్తా గ్యాప్ ఇచ్చి ఎవరికీ తెలియనివ్వకుండా రహస్యంగా ఆపరేషన్ చేయించుకుంద‌ట నికిషా. ఈ ఆపరేష‌న్ ముంబైలో జర‌గింద‌ని తెలుస్తోంది. తాజాగా నికిషా పటేల్ ఈ విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు ఆపరేషన్ జరిగిన మాట నిజమేనని వెల్లడించింది.త‌న‌కు చిన్న స‌ర్జ‌రీ జ‌రిగింద‌ని, ప్ర‌స్తుతం అంత బాగానే ఉంద‌ని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేసింది. ఎలిల్ సినిమాలో తన షూటింగ్ పార్ట్ పూర్తయిందని.. కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది నికిషా పటేల్‌.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -