Friday, April 19, 2024
- Advertisement -

వ్యాపారవేత్తతో హన్సిక పెళ్లి.. సడెన్ ట్విస్ట్..!

- Advertisement -

దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది హన్సిక. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలో వరుస అవకాశాలు దక్కించుకుంది. అయితే ప్రస్తుతం సినిమాలతో బీజీగా ఉన్న ఈ భామ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. చెన్నైకి చెందిన పారిశ్రామిక వేత్తను రెండో రోజుల్లో ఆమె వివాహం చేసుకోబోతున్నారనే వార్త తమిళ మీడియాలో సంచలనం రేపింది.

తమిళంలో సినీ పత్రికకు సంబంధించిన సోషల్ మీడియాలో అకౌంట్‌లో బ్రేకింగ్ న్యూస్ అంటూ వార్తను ప్రచురించింది. హీరోయిన్ హన్సిక రెండు రోజుల్లో ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నారు అంటూ ట్వీట్ చేశారు. దాంతో నెటిజన్లు ఆ వార్తపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ విపరీతంగా కామెంట్లు పెట్టారు. అయితే ఈ విషయంపై వెంటనే హన్సిక స్పందించారు. ట్విట్టర్‌లో ఓ పోస్టు పెడుతూ రబ్బిష్.. ఓ మైగాడ్ ఎవరతను, నాకు తెలియకుండా నాకు పెళ్లా అంటూ ప్రశ్నించారు.

ఆమె ట్వీట్‌కు కొందరు రిప్లై ఇస్తూ మాకు ఎందుకు ఛెప్పలేదు.. కంగ్రాట్స్.. మీకు పెళ్లా? అలాంటిది జరుగొద్దు అంటూ రకరకాల కామెంట్లతో ట్వీట్లు చేశారు. దీంతో హన్సిక పెళ్లి వార్త ఓ పుకారు అని చివరకు తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు. ఇక గతంలో హీరో శింబుతో హన్సిక ప్రేమలో పడింది. పెళ్లివరకు వెళ్లిన వీరి వ్యవహరం కొన్ని కారణాలతో బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే ఓ సినిమాలో మాత్రం తన మాజీ ప్రియుడు శింబుతో మళ్లీ నటించడానికి హన్సిక ఓకే చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.

రాజకీయాల్లోకి అనసూయ.. మాములు ట్విస్ట్ కాదు ఇది..!

మహేష్ టాటూ వెనుకున్న మ్యాటర్ ఇదే..!

ఛాన్స్ లు లేక ఇలియానా ఏం చేస్తుందంటే ?

ఛార్మీ పెళ్లి.. అందుకే ఆగిపోయిందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -