Monday, April 29, 2024
- Advertisement -

రెండో సూపర్ ఓవర్‌లో టీమిండియా గెలుపు

- Advertisement -

ఆప్ఘానిస్తాన్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ విధించిన భారీ లక్ష్యాన్ని ఆప్ఘాన్‌ రీచ్ అయింది. భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్ చేసిన ఆప్ఘాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 212 రన్స్‌ కొట్టింది. రహ్మానుల్లా గుర్బాజ్‌ (50), ఇబ్రహీం జద్రాన్‌ (50)గుల్బదీన్‌ నైబ్‌ (55 నాటౌట్‌), మహమ్మద్‌ నబీ 16 బంతుల్లో 34 చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

ఇక అంతకుముందు తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌. భారీ స్కోరు సాధించింది. ఒక దశలో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రోహిత్ శర్మ 69 బంతుల్లో 8 సిక్స్‌లు, 11 పోర్లతో 121 నాటౌట్‌గా నిలవగా రింకూసింగ్‌ 39 బంతుల్లో 69 నాటౌట్‌గా నిలవడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. వీరిద్దరూ 5వ వికెట్‌కు 190 పరుగులు జోడించారు. మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్‌కు వెళ్లింది.

తొలి సూపర్‌ ఓవర్‌
అఫ్గాన్‌: 1+వికెట్‌,1,4,1,6,3
భారత్‌: 1,1,6,6,1,1,

రెండో సూపర్‌ ఓవర్‌
భారత్‌: 6,4,1,వికెట్‌, వికెట్‌
అఫ్గాన్‌: వికెట్‌,1, వికెట్‌ లో టీమిండియా విజయం సాధించింది. రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ దక్కగా దూబేకు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు దక్కాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -