డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ లో కొత్త పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ లో షారుక్ తో కలిసి దిగిన ఫొటో తో మనోడు జనాలకు ఏదో చెప్పాలని ఆశపడుతున్నాడు.కాని ఆ చెప్పేదేదో మనోడెకే సరిగా తెలియక ఆడియన్స్ లో చులకన అయిపోతున్నాడు.
గబ్బర్ సింగ్ తర్వాత అంతటి స్థాయిలో చెప్పుకోవడానికి లేని చిత్రాలు చేసిన హరీష్ శంకర్… రాము టీంతో తిరిగి అటు బాలీవుడ్ బ్యాచ్ ను ఫామ్ చేశాడు.దానిలో భాగంగానే ఇలా షారుక్ తో జత కట్టాడు. బాలీవుడ్ బాద్ షాతో దిగిన ఫొటోలను పోస్ట్ చేసిన హరీష్, ‘నా జీవితంలోనే మరిచిపోలేని సమయం, సంభాషణ’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే షారూఖ్ ను ఎందుకు కలిశారన్న విషయాన్ని మాత్రం హరీష్ ఎక్కడ రివీల్ చేయలేదు. ఇంతకుముందుకు కూడా పలు సందర్భాల్లో హరీష్ … షారూఖ్ ను కలిశాడు.
ఆటైమ్లో షారూఖ్ తో హరీష్ సినిమా చేస్తున్నాడంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈసారి మనోడు పెట్టిన పోస్ట్ ఆ సంకేతాలు నిజమవ్వబోతున్నాయి అని చెప్పే ఉద్దేశ్యంలో బాగంగా ఇలా ట్విట్టర్ లో షారుక్ ఫొటో పెట్టాడని అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేల అదే నిజమైతే ..హరీష్ పంట పండినట్లే..
