Sunday, June 2, 2024
- Advertisement -

ఫెరోల్‌పై విడుద‌ల‌….

- Advertisement -

అక్ర‌మాస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహారం జైలులో శిక్షఅనుభ‌విస్తున్న శ‌శిక‌ళా న‌ట‌రాజ‌న్ ఎట్ట‌కేల‌కు జైలునుంచి విడుద‌ల అయ్యారు. ఆమె భర్త నటరాజన్‌ రెండు నెలల నుంచి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె భర్తను కలవడానికి వెళ్లేందుకు మొదట పెరోల్‌ కోరగా కర్ణాటక జైళ్ల శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో అమె క‌ర్నాట‌క హైకోర్టును ఆశ్ర‌యించింది.

న్యాయస్థానం ఇరు రాష్ట్రాల స్పందనను కోరగా.. అభ్యంతరం లేదని తమిళనాడు ప్రభుత్వం, కర్నాటక ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. దీంతో ఆమె కాసేపట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు రోజులకు గానూ ఆమెకు కోర్టు పెరోల్‌ను కోర్టు మంజూరు చేసింది. దీంతో అమె విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మం అయ్యింది.

ఫెరోల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన శ‌శిక‌ళ వ్యక్తిగత అవసరాల కోసమే పెరోల్‌ ను వినియోగించుకోవాలని… రాజకీయ కార్యక్రమాలను హాజరు కావొద్దని ఆమెను కోర్టు ఆదేశించింది. కాగా, అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన శశికళ ప్రస్తుతం కర్నాటక లోని పరప్పన అగ్రహారం జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -