Monday, May 13, 2024
- Advertisement -

హరితేజను అభిరుచి నుంచి తీసేస్తే.. ఏం చేసింది..?

- Advertisement -

ముందు నుంచి హరితేజ మంచి యాంకర్. అభిరుచి అనే వంట ప్రోగ్రాంలో హరితేజ యాంకర్ గా చేసింది. అడపాదడపా సీరియల్స్ కూడా చేసింది. మధ్య మధ్య లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉంటూ ,ఫైనల్ విన్నర్ అవుతుందేమో అనేలా అంచనాలు పెంచుతుంది హరితేజ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో హరితేజకు సత్సంభందాలున్నాయి. హరితేజను త్రివిక్రమ్ సూర్యాకాంతం అని ఆటపట్టిస్తుంటారు.

ఎలాంటి క్యారెక్టర్ అయినా అలవోకగా చేసేయగలదు అనే త్రివిక్రమ్ హరితేజను అలా పిలుస్తారు. అభిరుచి ప్రోగ్రాంలో యాంకర్ గా హరితేజ చాలా కాలం కొనసాగింది. ఆ తర్వాత హరితేజను ఆ ప్రోగ్రాం నుండి తీసేసినప్పడు చాలా బాదతో త్రివిక్రమ్ కి కాల్ చేస్తే..“ నువ్వు ఆ ప్రోగ్రామ్ కు ఎమోషనల్ కనెక్ట్ అవ్వలేదు తొక్కా లేదు, నీకు ఆ ప్రోగ్రామ్ అంటే ఎందుకిష్టమో చెప్పనా.. పక్కన రాజుగారు(కుక్) వంట చేస్తుంటే వాటిని చూస్తు ఉండడం, తినడం ఇష్టం అందుకే బాధ పడుతున్నావ్ అంతే!!” అని త్రివిక్రమ్ గారు బదులిచ్చారట. దానికి హరితేజ కు నవ్వు ఆపుకోలేక పోయిందట అలా నవ్వించి తనని ఓదార్చారు…ఆ తర్వాత త్రివిక్రమ్,నితిన్ కాంబినేషన్లో వచ్చిన అఆ మూవిలో హరితేజకు మంచి రోల్ ఇచ్చారు.

షూటింగ్ జరిగిన సమయంలో త్రివిక్రమ్ గారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నానని,ముఖ్యంగా పుస్తకాలు చదివే అలవాటు .. “ఒక ధృడమైన జన్మ ఎన్నో జన్మలను కదిలించగలదు”. త్రివిక్రమ్ గారి వల్ల హరితేజ తన జీవితానికి అవసరమయ్యే గొప్ప పుస్తకాలు చదవడం మొదలుపెట్టిందట.. నిజమే సినిమాలకు త్రివిక్రమ్ గారు రాసే మాటలు ప్రేక్షకులకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి..అలాంటిది అతను డైరెక్ట్ గా మనుషులను ప్రభావితం చేస్తారనడానికి హరితేజ ఉదాహరణ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -