Wednesday, May 8, 2024
- Advertisement -

టీడీపీ అధికార దుర్వినియోగాన్ని ఆధారాల‌తో బ‌య‌ట పెట్టిన మాజీ ఎంపీ..

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక జ‌రిగి రోజులు గ‌డుస్తున్నా అధికార టీడీపీ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతూనె ఉన్నాయి. అధికార దుర్వినియేగానికి పాల్పడింద‌ని ప్ర‌త‌ప‌క్షాల‌న్ని ఆరోపిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సంచలన నిజాలు బయటపెట్టారు. అధికార టీడీపీ ఏవిధంగా విజయం సాధించిందో రట్టు చేశారు. గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందని ఆధారాలతో సహా వెల్లడించారు.

ఎక్కడైనా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకోవటం చూసాం, విన్నాం. కానీ నంద్యాలలో జరిగిందేమిటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రభుత్వమే వేలాది ఓట్లను కొనుగోలు చేసి టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించింది. రాష్ట్రం మొత్తం మీద డ్వాక్రా సంఘాలున్నట్లే నంద్యాలలో కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో సుమారు 13 వేల మంది డ్వాక్రా మహిళులున్నారట. వారందరికీ తలా రూ. 4 వేలు ఎన్నికల సమయంలో అంటే పోలింగ్ కు ముందు వారి వ్యక్తిగత ఖాతాల్లో జమైందట.

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు తీర్చటంలో తప్పేంటనే సందేహం వ‌స్తోందా..! మ‌త‌ల‌బు అంతా అక్క‌డే ఉంది. ఏంటంటే, 2015-16లో డ్వాక్రా మహిళలకు తలా రూ. 3 వేలు వేసింది. అదేవిధంగా 2016-17లో కూడా వేసింది. అయితే, 2017-18లో మాత్రం రాష్టంలో ఎక్కడ కూడా ఒక్కరూపాయి జమచేయలేదు. అటువంటిది ఒక్క నంద్యాలలో మాత్రమే డ్వాక్రా గ్రూపులకు ప్రభుత్వం ఎందుకు జమచేసింది? అంటే అక్కడ ఉపఎన్నిక జరుగుతోంది కాబట్టి, అక్కడ టిడిపి ఖ‌శ్చితంగా గెలవాలికాబట్టి.

మిగతా ప్రాంతాల్లో కూడా డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులు వేయ‌లేద‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు.. నగర పాలక ఎన్నికలు జరిగిన కాకినాడలోనూ డ్వాక్రా ఖాతాల్లోనూ డబ్బులు వేయలేదని తేలింది. నాకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఒక్క నంద్యాలలోనే డ్వాక్రా మహిళల అకౌంట్లలో రూ.4 వేలు చొప్పున జమ చేశార‌ని ఉండ‌వ‌ల్లి ఆధారాల‌తో మీడియాకు వెల్ల‌డించారు. మ‌రి దీని మీద టీడీపీ నేత‌లు ఏమంటారో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -