Sunday, April 28, 2024
- Advertisement -

వైష్ణవ్ తేజ్..హ్యాట్రిక్ ఫ్లాప్స్!

- Advertisement -

ఉప్పెన సినిమాతో ఓవర్‌ నైట్‌లో స్టార్ హీరోగా మారిపోయారు పంజా వైష్ణవ్ తేజ్. మెగా కాంపౌండ్ నుండి వచ్చినా తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో చాలా మంది నిర్మాతలు, దర్శకులు వైష్ణవ్ తేజ్‌తో సినిమాతో తీసేందుకు పోటీపడ్డారు. తర్వాత వెంటవెంటనే మూడు సినిమాలకు ఓకే చెప్పేశారు కూడా.

కానీ తర్వాత వచ్చిన కొండపొలం, రంగ రంగ వైభవంగా తాజాగా ఆదికేశవ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొళ్తా కొట్టాయి. దీంతో హ్యాట్రిక్ ఫ్లాప్‌లను మూటగట్టుకున్నారు వైష్ణవ్. ఇక ఈ మూడు సినిమాల్లో కొండపొలం ఒక్కటే కాస్త అటో ఇటో బెటర్ కాగా ఆదికేశవ అయితే వరెస్ట్ రేటింగ్స్ సాధించింది. ఇక ఈ సినిమాలో నటన పరంగానూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు వైష్ణవ్.

కొత్త దర్శకుడితో ఈ సినిమా తెరకెక్కించడం, కథ తెలిసిందే కావడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పటికైన వైష్ణవ్ కథల ఎంపికపై జాగ్రత్త వహిస్తే తిరిగి ట్రాక్‌లో పడవవచ్చని పలువురు సూచిస్తున్నారు. మరి తన తర్వాతి సినిమాల విషయంలోనైనా వైష్ణవ్ జాగ్రత్తలు తీసుకుని హిట్ కొడతాడా లేదా వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -