Saturday, May 4, 2024
- Advertisement -

కాంగ్రెస్‌లోకి సీఎం కేసీఆర్ సన్నిహితుడు!

- Advertisement -

ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడు,మాజీ మంత్రి, నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత మంవడవ వెంకటేశ్వరరావు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరనున్నారు.

2019లో సీఎం కేసీఆర్ స్వయంగా మండవ ఇంటికి వెళ్లి ఆయన్ని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. దీంతో వెంటనే ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. అయితే తాజాగా ఎన్నికల వేళ ఆయన బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరనుండటం చర్చనీయాంశంగా మారింది. మండవకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. ప్రధానంగా సెటిలర్ల ఓట్లను ప్రభావం చూపే సత్తా ఉన్న నేత.

టీడీపీ నుండి రాజకీయ ఆరంగేట్రం చేశారు మండవ. డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994, 1999 వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1995లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, 1997లో చంద్రబాబు మంత్రివర్గంలో ఎక్సైజ్‌ శాఖమంత్రిగా పని చేశారు. 1999లో గెలిచిన తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, తర్వాత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత 2004,2009,2010లో ఓటమి తర్వాత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్‌లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -