Saturday, April 27, 2024
- Advertisement -

మహేష్ ఆ టైంకి ఖచ్చితంగా రాడంట!

- Advertisement -

టాలీవుడ్ లో మన హీరోలు సెంటిమెంట్స్ బాగానే నమ్ముతారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి కూడా సెంటిమెంట్స్ బాగానే ఉన్నాయి. తన సినిమా రిలీజ్ అవుతుందంటే తిరుపతి వెళ్లి వెంకన్నని దర్శించుకోవడం అలాగే కడప దర్గాకి వెళ్ళడం వంటివి చేస్తుంటాడు. ఇలా చేయడం వల్ల తన సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకుంటాయి అని మహేష్ నమ్మకం.

ఇప్పుడు మహేష్‍కి మరో నమ్మకం తోడైంది అంటున్నారు సినీవర్గాలు. ఆ నమ్మకం ఏంటంటే..? మహేష్ తన సినిమాలను కనుక సమ్మర్లో విడుదల చేస్తే దాని రిజల్ట్ చాలా ఘోరంగా ఉంటుందని కొందరి నమ్మకం. ఎందుకు అలా అంటే ఒక్క పోకిరి సినిమాని పక్కన పెడితే మహేష్ నటించి సమ్మర్ లో రిలీజ్ అయిన బాబీ, నాని లేటెస్ట్ బ్రహ్మోత్సవం వంటి సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యాయి.

బ్రహ్మోత్సవం అయితే ఓ రెంజ్‍లో నష్టాలు తెచ్చిపెట్టింది. దాంతో ఇప్పుడు మహేష్, మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రాన్ని మొదట సమ్మర్ కే రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ తరువాత వద్దనుకుని కుదిరితే సంక్రాంతికి లేకపోతే జూలై లేదా ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ కొత్త నిర్ణయంతో మహేష్ మంచి హిట్ కొడుతాను అనే నమ్మకంగా ఉన్నాడు. దర్శకనిర్మాతలు కూడా ఇదే కోరుకుంటున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -