Wednesday, May 8, 2024
- Advertisement -

పదవికి 57 మంది పోటీ

- Advertisement -

భారత క్రికెట్ జట్టు. ప్రపంచ క్రికెట్ రంగంలో రారాజు. ఈ రారాజుకు కూడా ఓ మార్గదర్శి కావాలి. అతనే కోచ్. ఈ పదవి అందరికి దక్కేది కాదు. దీనికి అనేక అర్హతలు ఉండాలి. అలాంటి వారి కోసమే భారత క్రికెట్ నియంత్రణ మండలి అన్వేషణ చేస్తోంది. ఈ అన్వేషణలో భాగంగా ప్రపంచ దిగ్గజాల వంటి క్రికెటర్లు భారత జట్టుకు కోచ్ గా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈ పదవి కోసం 57 మంది మాజీలు పోటీ పడుతున్నారు. ఇందులో స్వదేశానికి చెందిన వారితో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయితే వీరి ఎంపిక బాధ్యతను బిసిసిఐ భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలి, వి.వి.ఎస్.లక్ష్మణ్ లకు అప్పగించింది బిసిసిఐ. ఈ ముగ్గురూ భారత క్రికెట్ సలహా సంఘం సభ్యులు కావడంతో వీరికి ఈ బాధ్యతాయుతమైన పని అప్పగించినట్లు బిసిసిఐ ప్రకటించింది.

కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న 57 మందిలో నుంచి అర్హులైన కొందరిని ఎంపిక చేసి ఈ నెల 21 లోగా తుది జాబితాను తయారు చేస్తారు. వారిలో నుంచి ఒకరిని ఈ నెల 27 నాటికి ముగ్గురు సభ్యుల కమిటీ ఎంపిక చేసి బిసిసిఐకి నివేదిక ఇస్తుందని బిసిసిఐ అధికారులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం లండన్ లో ఉన్న సచిన్ టెండూల్కర్ వీడియో కాన్షరెన్స్ ద్వారా అందుబాటులో ఉంటారని తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -