Sunday, May 5, 2024
- Advertisement -

పౌష్టికాహార లోపమే కారణం

- Advertisement -

భారతదేశంలో బాలలకు ఇది విషాదం. ఇక్కడ బాల్యం ఎదగడం లేదు. వందకి 38.7 శాతం మంది పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. ఇది తల్లితండ్రుల పాలిట శాపంగా మారుతోంది. దేశంలో బాలలు తింటున్న ఆహారం పౌష్టికం కాకపోవడమే కారణమని గ్లోబల్ న్యూట్రీషిన్ నివేదిక చెబుతోంది. బాలల కోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా అవి చిన్నారులకు చేరకపోవడమే ఇక్కడి విషాదం.

బాలలపై వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఆద్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ న్యూట్రీషిన్ సర్వే నివేదికలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా 132 దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి.

వీటిలో భారతదేశానిది 114 స్ధానం కాగా చైనా 26 స్ధానంలో ఉంది. ఇక ఘనా దేశమైతే 52 స్ధానంలో ఉంది. ఇక మధుమేహ వ్యాధిపై జరిపిన సర్వేలో కూడా భారత్ ను ఆందోళన పరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ తో బాధపడుతున్న 190 దేశాల్లో భారత్ ది 104 స్ధానం కావడం గమనార్హం. అలాగే ఊబకాయం విషయంలో కూడా భారతీయులు ఇబ్బందులు పడుతున్నారని మరో సర్వేలో తేలింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -