Sunday, May 4, 2025
- Advertisement -

నవీన్ పోలిశెట్టికి గాయాలు..మీ ప్రేమ కావాలంటున్న హీరో!

- Advertisement -

జాతిరత్నాలు సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ హీరోగా మారారు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో మెప్పించారు నవీన్. అనుష్కతో సైతం సినిమా చేశారు నవీన్. అయితే తాజాగా తనకు ప్రమాదం జరిగిందని చేతికి పలు చోట్ల ప్రాక్చర్, కాలికి గాయమైందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు నవీన్.

ఈ సమయంలో నాకు మీ ప్రేమ కావాలి…అదే ఔషధంగా పనిచేస్తుందని చెప్పారు. అయితే గాయం నుండి కోలుకునేందుకు కృషి చేస్తున్నా కానీ చాలా కష్టంగా ఉందని, మీ అందరి ప్రేమతో త్వరలో బిగ్ స్క్రిన్‌పై అలరిస్తానని చెప్పారు నవీన్. గుడ్ న్యూస్ ఏంటంటే నా తదుపరి చిత్ర స్క్రిప్ట్ చాలా అద్భుతంగా వస్తోందన్నారు. గాయం నుండి కోలుకున్న వెంటనే షూటింగ్ ప్రారంభమవుతుందని, అప్పుడు కూడా ఇలాగే నాపై ప్రేమ కురిపిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో వెండితెరకు పరిచయం అయ్యారు నవీన్. ఆ తర్వాత వచ్చిన జాతిరత్నాలు నవీన్‌ను ఓవర్‌నైట్ స్టార్‌ హీరోని చేసింది. ఈ సినిమాలో నవీన్ కామెడీ టైమింగ్ అందరిని ఆకట్టుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -