Friday, May 17, 2024
- Advertisement -

హీరో నిఖిల్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరంటే..?

- Advertisement -

నిఖిల్‌.. కొత్త రకం కథలు ఎంచుకుంటూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వరస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ హీరో పెళ్లి రెడీ అయ్యారు. తనకు దగ్గరి బంధువు అయిన తేజస్విని అనే అమ్మాయితో నిఖిల్‌ పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్‌ కుమార్తె అని చెబుతున్నారు. ఈ నెల 24న నిశ్చితార్థం, అక్టోబరు తొలివారంలో పెళ్లి జరగనుందట.

ఇక గత ఏడాది కాలంగా నిఖిల్ కోసం ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆఖరికి వారి దగ్గరి బంధువల్లోనే మ్యాచ్ ఫిక్సవటంతో అందరూ హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ వార్తపై నిఖిల్‌ నుండి అధికారిక ప్రకటన రావాల్సివుంది. తాజాగా ఒక జిమ్‌ బిజినెస్‌ను కూడా ప్రారంభించారు. మంచి జోరు మీదున్న ఆ కుర్ర హీరో.. ఇదే ఊపులో చకచకా సినిమాలకు సంతకాలు చేసేస్తున్నాడు. ప్రస్తుతం ఓ కన్నడ సినిమా రీమేక్ కోసం బరువు పెరిగే పనిలో ఉన్నాడు ఈ హీరో.

‘కిరిక్ పార్టీ’ రీమేక్ లో స్టూడెంట్ లీడర్‌గా కనిపించబోతున్న నిఖిల్… మరో రెండేళ్ల వరకూ ఫుల్ బిజీ అని తెలుస్తోంది. ఇక చందూ మొండేటి కూడా నిఖిల్‌తో ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -