Friday, May 17, 2024
- Advertisement -

ఎట్ట‌కేల‌కు మ‌ద్ద‌తు తెలిపిన మిత్ర ప‌క్షం…

- Advertisement -

ఏపీలో భాజాపా-టీడీపీ కేట‌మికి మ‌ధ్య ఉన్న విబేధాల‌కు భాజాపా తెర‌దించింది. చివ‌రికి త‌న మౌనం వీడింది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూట‌మినుంచి విడిపోయి..వైసీపీతో క‌ల‌సి పోటీ చేస్తుంద‌నే ఊహాగానాల‌కు అడ్డుక‌ట్ట వేసింది.రాష్ట్రంలో హాట టాపిక్‌గా మారిత నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు దూరంగా ఉంది. చంద్ర‌బాబె దూరంగా పెట్టార‌నే వార్త‌లు వినిపించాయి.

కీల‌క స‌మ‌యంలో భాజాపా టీడీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. విజ‌య‌వాడ‌లో భాజాపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సిద్దార్థ‌నాద్ సింగ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో నేత‌లు,మంత్రులు మ‌ద్ద‌తు తెలిపారు.సోమ‌వారం నుంచి నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి దిగుతామ‌న్నారు.

నియోజకవర్గంలో మైనారిటీల ఓట్ల కోసమే భాజపాను చంద్రబాబు దూరం పెట్టేసారు. నంద్యాలలో ఓ అభ్యర్ధి గెలుపోటముల్లో మైనారిటీల ఓట్లు చాలా కీలకం. మొత్తం 2.3 లక్షల ఓట్లలో మైనారిటీల ఓట్లు సుమారుగా 60 వేలు. భాజపాతో కలిసి ప్రచారం చేస్తే మైనారిటీ ఓట్లు ఎక్కడ దూరమవుతాయో అన్న భయంతోనే ఇంతకాలం వాళ్లని దూరంగానే ఉంచారన్నది బహిరంగ రహస్యం.

అయితే ఇప్పుడు మ‌ద్ద‌తు తెల‌ప‌డం వ‌ల్ల టీడీపీకి న‌ష్టం వాటిల్లే ప్ర‌మాద‌ముంది. భాజాపా నిర్న‌యం తీసుకోవ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.ఇప్ప‌టికే ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. చంద్రబాబు లెక్కప్రకారం భాజపా ప్రచారానికి వస్తే టిడిపి నష్టపోతుంది కదా? టిడిపి నష్టపోతుందని తెలిసీ భాజపా నేతలు ప్ర‌చారం చేయ‌డం ఇప్పుడు ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -