Saturday, May 4, 2024
- Advertisement -

అబద్ధపు లవ్‍ని..నితిన్ నిజం చేస్తాడా..?

- Advertisement -

నితిన్.. ఈ యంగ్ హీరోకి టాలీవుడ్ లో ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. అయితే నితిన్ కెరీర్ స్టార్టింగ్ లో మంచి ఊపులో ఉంది. సై సినిమా తర్వాత నితిన్ మళ్లీ ఆ స్థాయిలో హిట్ కొట్టాలేకపోయాడు. వరసగా 13 సినిమాల వరకు నితిన్ హిట్ కొట్టాలేకపోయాడు. ఇక నితిన్ పని అయిపోయిందనుకున్న టైంలో.. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఇష్క్ సినిమా చేసాడు.

ఈ సినిమా ఎవరు ఊహించని రెంజ్ లో మంచి హిట్ సాధించడంతో.. నితిన్ మళ్లీ తన కాళ్ల మీద తను నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అయిన నితిన్.. ఆయను తన సినిమా ఆడియో వేడుకలకు అతిథిగా పిలిస్తుంటాడు. ఇష్క్ తర్వాత వరస సినిమాలతో దూసుకెళ్తున్నాడు నితిన్. అయితే. నితిన్ ఆ మధ్య గుత్తా జ్వాల తో డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలపై గుత్తా జ్వాల క్లారిటీ ఇస్తూ.. నితిన్ తో స్నేహం గురించైతే చెప్పే అవసరం లేదని.. సినిమాల్లో నటిస్తాను అని ఒక్క మాట చెప్పగానే ఓ ఆఫర్ తీసుకుని వచ్చేశాడని చెప్పింది. నితిన్ తనకు మంచి ఫ్రెండ్ అని.. అతనితో స్నేహం తప్పిస్తే మరే సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఇక నితిన్ ఇప్పుడు లై సినిమాలో హీరోయిన్ గా నటించిన మేఘా ఆకాష్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మేఘా ఆకాష్ తో పీకల్లోతు ప్రేమలో నితిన్ ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దలతో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. సినిమాలో ఫైయిల్ అయినా నిజ జీవితంలో కలిసిపోయేందుకు వారు సిద్దమవుతున్నారనే చర్చ ఇప్పుడు పిల్మ్ నగర్ లో చక్కర్లుకొడుతోంది. అయితే లై సినిమా ప్లాప్ అయిన నితిన్ నటించబోయే ఓ సినిమాలో రెండో సారి మేఘా ఆకాష్ ఛాన్స్ ఇచ్చాడు. ఛాన్స్ ఇవ్వడం వెనుక ఆఫ్ ది స్క్రీన్ కూడా ఆమెను అమితంగా ఇష్టపడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -